
సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం:
ఢిల్లీ క్యాపిటల్స్‌పై పరాజయం అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. సన్‌రైజర్స్ ఎలెవన్ నుంచి మనీష్ పాండేను ఎందుకు తొలగించారు అని అడిగిన ప్రశ్నకు.. 'మనీష్ పాండేకు తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం అది కఠినమైన నిర్ణయం. అయితే అది సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం. నేనేమీ చేయలేను. పాండేను పక్కనపెట్టడం నాకిష్టం లేదు' అని వార్నర్ స్పష్టం చేశాడు. టామ్ మూడీ, ట్రెవర్ బేలిస్, బ్రాడ్ హాడిన్, వివిఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ సన్‌రైజర్స్ కోచింగ్ బృందంలో ఉన్న విషయం తెలిసిందే.

విరాట్‌ను నిందించలేను:
మనీష్ పాండే స్థానంలో 23 ఏళ్ల విరాట్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆడాడు. 14 బంతుల్లో 4 పరుగులు చేశాడు. దీనిపై డేవిడ్ వార్నర్ స్పందిస్తూ... 'చెపాక్ పిచ్ సవాల్ విసిరింది. విరాట్‌ను ఏమాత్రం నిందించలేను. అతను చాలా మంచి ఆటగాడు. ఈ పిచ్‌పై కుదురుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే అతడికి ఇబ్బందిగా మారింది. ఢిల్లీ బౌలర్లు కూడా మధ్య ఓవర్లలో బాగా వేశారు. కేన్ చివరి ఉండి బాగా ఆడాడు. ఆరంభంలో జానీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు' అని పేర్కొన్నాడు.

పాండేను పక్కన పెట్టి సాహసం చేసిన హైదరాబాద్:
ఐపీఎల్‌లో ఏ టీమ్ అయినా స్టార్ ఇండియన్ ప్లేయర్స్‌ను తుది జట్టు నుంచి తప్పించవు. గాయం కారణంగానో, పూర్తి ఫిట్‌గా లేకపోతేనో తప్పనిసరి పరిస్థితుల్లో పక్కనపెడతారు. కానీ ఈ సీజన్‌లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచీ నిలకడగా రాణిస్తున్న మనీష్ పాండేను పక్కన పెట్టి పెద్ద సాహసమే చేసింది. దానికి తగిన మూల్యం కూడా చెల్లించింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లలో మనీష్ 101 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 61. మొత్తంగా ఐపీఎల్‌లో 149 మ్యాచ్‌లాడి 3369 పరుగులు చేసిన అనుభవం అతని సొంతం. అలాంటి ప్లేయర్‌ను పక్కన పెట్టి తప్పు చేశామని వార్నర్ మాటలను బట్టి అర్ధమవుతోంది.

ఏడ దొరికాడురా ఈ విరాట్ గాడు:
డాట్ బాల్స్ ఆడిన విరాట్ సింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. విరాట్ ఆడిన తీరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాన్స్ మండిపడుతూన్నారు. 'అరేయ్ కుయ్యా.. ఆ విరాట్ సింగ్‌ను ఎలా పెట్టుకున్నారు అసలు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఏడ దొరికాడురా ఈ విరాట్ గాడు' అని మరొకరు ట్వీట్ చేశారు. '20 ఓవర్లను 18 ఓవర్లుగా చేశాడు కదరా? ', 'వీడు మనీష్ పాండే కంటే తాతలా ఉన్నాడుగా', 'సన్‌రైజర్స్ యాజమాన్యానికి ఏమైంది' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. మరికొందరు ఫాన్స్ అయితే రాయారని విధంగా కూడా ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












