
ఐసీసీకి సూచన:
మన్కడింగ్ చేసినప్పుడు బౌలర్‌కు 'ఫ్రీ బాల్' ఇస్తే బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. బౌలర్ నో బాల్ వేసినప్పుడు బ్యాట్స్‌మన్‌కు ఎలా ఫ్రీహిట్ ఉంటుందో.. నాన్ స్టైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ బంతిని వేయకముందే క్రీజ్‌ను దాటి ముందుకు వెళితే ఫ్రీబాల్ నిబంధనను తేవాలంటున్నాడు. ఫ్రీబాల్‌లో బ్యాట్స్‌మన్ ఔటైతే బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు కోత విధించాలని అంటున్నాడు. ఫ్రీబాల్‌లో బ్యాట్‌మన్ పరుగు చేసినా లెక్కించకూడదని తెలిపాడు.

ఫ్రీ బాల్ ఇవ్వండి:
'బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వండి. బంతి వేసేముందే బ్యాట్స్‌మన్ క్రీజు దాటితే బ్యాటింగ్ జట్టు నుంచి 5 పరుగులు తగ్గించాలి. ఫ్రీహిట్‌తో లాభమంతా బ్యాట్స్‌మన్‌కే కదా. అలాగే బౌలర్లకూ అవకాశం ఇవ్వండి. ఇప్పుడంతా బౌలింగ్‌ను ఎలా చితకబాదుతారో అన్న ఆసక్తితోనే క్రికెట్ చూస్తున్నారు' అని రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా క్వాలిఫయింగ్ కోసం నిర్వహించే సూపర్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ నిర్ణయాన్ని టీవీ అంపైర్‌కు ఐసీసీ అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అశ్విన్ కొత్త ప్రతిపాదన తెచ్చాడు.

మన్కడింగ్ ద్వారా బట్లర్ ఔట్:
గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అయిన ఆర్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. మైదానంలోనే బట్లర్ దీనిపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక టోర్నీ మొత్తం అదే చర్చ నడిచింది. చాలామంది క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పేర్కొన్నారు. మరికొందరు మాత్రం సమర్థించారు. అయితే తాను సిగ్గుపడనని, నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ బాహాటంగానే చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అశ్విన్ ఇప్పటివరకు 71 టెస్టుల్లో, 111 వన్డేల్లో, 46 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

అశ్విన్‌ను అలా చేయనివ్వను:
ఇక ఈసారి వేలంలో పంజాబ్ ప్రాంచైజీ ఆర్ అశ్విన్‌ను ఢిల్లీకి వదులుకుంది. ఢిల్లీ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా మన్కడింగ్‌పై రికీ మాట్లాడుతూ... 'ఢిల్లీ క్యాపిటల్స్ అలాంటి (మన్కడింగ్) తరహా క్రికెట్‌ను ఆడబోవడం లేదు. నేను ఆర్ అశ్విన్‌ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. మన్కడింగ్ ఘటన జరిగినప్పుడు నేను ఢిల్లీ ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్ లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై కచ్చితంగా చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం అలాగే భావిస్తాం' అని అన్నాడు.
ధోనీతో పోలిస్తే నాలో ఆ ముఖ్య లక్షణం లేదు.. మహీలా ప్రయత్నించి విఫలమయ్యా: పాంటింగ్


Click it and Unblock the Notifications












