లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పడంపై నా కూతురు ప్రశ్నించింది: గంగూలీ

హైదరాబాద్: లార్డ్స్ బాల్కనీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీ షర్ట్ తీసి గాల్లోకి ఊపిన ఆ సంఘటన అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసింది. నాట్‌వెస్ట్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 326 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించి ఘన విజయాన్ని నమోదు చేసింది.
అనంతరం గంగూలీ లార్డ్స్ బాల్కనీలో టీ షర్ట్ తీసి అభిమానులకు అభివాదం చేస్తూ గాల్లోకి ఊపిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలోనే అభిమానులు ఈ సంఘటనను ఓ అపురూపమైనదిగా భావిస్తుంటారు. కానీ, ఆ సమయంలో షర్ట్ విప్పొద్దని వీవీఎస్ లక్ష్మణ్ ఎంత చెప్పినా తాను వినలేదని ఓ చాట్ షోలో పాల్గొన్న గంగూలీ పేర్కొన్నాడు.

బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో పాల్గొన్న గంగూలీ
తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో పాల్గొన్న గంగూలీ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని అభిమానులతో పంచుకున్నాడు. "ఆ సమయంలో నా వెనక హర్భజన్, ఎడమ వైపు లక్ష్మణ్ ఉన్నారు. విజయానంతరం సంతోషంతో నేను నా టీషర్ట్‌ను టీ షర్ట్ విప్పుతుంటే.. అలా చేయకు అని వీవీఎస్ ఒకట్రెండుసార్లు వారించాడు. కానీ నేను వినలేదు" అని దాదా అన్నాడు.

నువ్వు కూడా షర్ట్ తీసేయ్ అని చెప్పా
"నాషర్ట్ తీసేసాను. అప్పుడు లక్ష్మణ్ నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. దానికి నువ్వు కూడా షర్ట్ తీసేయ్ అని చెప్పా" అని గంగూలీ నాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నాడు. అయితే ఇలా షర్ట్ విప్పి సెలెబ్రేషన్ చేయాలనుకున్నది మాత్రం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను చూసేనని గంగూలీ తెలిపాడు.

వాంఖడేలో ఫ్లింటాఫ్ కూడా షర్ట్ విప్పి గాల్లో తిప్పాడు
అదే ఏడాది భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-3తో డ్రా చేసుకున్న తర్వాత వాంఖడేలో ఫ్లింటాఫ్ కూడా షర్ట్ విప్పి గాల్లో తిప్పాడు. ఆ సంఘటన గుర్తుకు రావడం వల్లే అప్పటికప్పుడు తాను అలా చేశానని గంగూలీ వెల్లడించాడు. "లార్డ్స్‌లో గెలిచిన మరుక్షణం ఆ ఆలోచన వచ్చింది. వాంఖడేలో ఫ్లింటాఫ్ చేయగాలేనిది.. లార్డ్స్‌లో మనమెందుకు చేయకూడదని అనుకున్నా" అని గంగూలీ పేర్కొన్నాడు.

ఈ ఘటనపై నా కూతురు సనా కూడా ప్రశ్నించింది
"కానీ ఆ సంఘటన తర్వాత చాలా బాధపడ్డా. కానీ ఈ ఘటనపై నా కూతురు సనా..‘షర్ట్ విప్పడం క్రికెట్‌లో తప్పని సరా? నీవు ఎందుకు అలా చేశావు' అని అడిగిన ప్రశ్నకు చాలా ఇబ్బందికి గురయ్యానన్నాడు. అప్పుడేదో పొరపాటుగా చేశానని చెప్పా. జీవితంలో కొన్ని సంఘటనలు మన నియంత్రణ లేకుండానే జరిగిపోతాయి" అని సనాకు తెలిపినట్లు పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications