Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy: సెమీఫైనల్‌లో భారత్ ఎవరితో తలపడనుందో తెలుసా?

‌ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో గ్రూప్‌-ఎ సెమీస్‌ బెర్తులు ఖరారైపోయిన సంగతి తెలిసిందే. గ్రూప్‌లోని నాలుగు జట్లు కూడా ఇంకా ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉండగానే.. సెమీస్‌ కు చేరే జట్లపై క్లారిటీ వచ్చేసింది. చెరో రెండు విజయాలు సాధించిన న్యూజిలాండ్‌, టీమిండియా నాకౌట్‌కు అర్హత సాధించాయి. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పట్టాయి.

గ్రూప్ బీలో ప్రస్తుతానికి సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఇంగ్లాండ్ దాదాపుగా సెమీ ఫైనల్స్ రేసులో లేదు. ఒకవేళ ఇంగ్లాండ్ రేసులోకి రావాలంటే.. ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా మిగిలిన తమ రెండో మ్యాచుల్లో ఒక దాంట్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ తన రెండు మ్యాచుల్లోనూ గెలవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియానే సెమీస్ కు వెళ్లేలా కనిపిస్తున్నాయి.

Do you know who will teamindia face in Champions Trophy 2025 semi-finals

అయితే ఇప్పుడు గ్రూప్ ఏలో ఇండియా మొదటి స్థానంతో ముగిస్తే.. గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ లో పోటీ పడాల్సి వస్తుంది. అదే భారత్ గ్రూప్ ఏలో రెండో స్థానంతో ముగిస్తే.. గ్రూప్ బీలో మొదటి స్థానంలో ఉన్న సౌతాఫ్రికాతో తలపడాల్సి వస్తుంది. ఫైనల్ గా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సెమీఫైనల్ లో భారత్.. ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాతో పోటీ పడుతుంది. లేదు ఏమైనా అద్భుతం జరిగితే ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంటుంది. కాగా, మార్చి 4న దుబాయ్ వేదికగా టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ భారత్ జట్టు ఫైనల్ కు అర్హత సాధించినా దుబాయ్ వేదికగానే ఆడుతుంది.

Take a Poll
Story first published: Tuesday, February 25, 2025, 11:24 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+