T20 Wold Cup 2022: దక్షిణాఫ్రికాకు 5 పరుగులు బోనస్.. ఎందుకంటే..

టీ20 ప్రపంచకప్ 2022 లో భాగంగా.. గురువారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు 5 పరుగులు బోనస్ వచ్చాయి. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కీపర్ కదలడంతో బంగ్లాపై ఎంపైర్లు పెనాల్టీగా దక్షిణాఫ్రికాకు 5 పరుగులిచ్చారు.
షకీబ్ అల్ హసన్ బంతిని వేస్తున్న క్రమంలో వికెట్ కీపర్ నూరుల్ హసన్ కదలడంతో బంగ్లాకు అంపైర్లు జరిమానా విధించారు.
నిబంధనల ప్రకారం
నిబంధనల ప్రకారం, బౌలర్ రన్-అప్ సమయంలో వికెట్ కీపర్ కదలడానికి అనుమతి లేదు. కాగా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీగా పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఏడు పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది ప్రొటీస్ టీమ్. కేప్టెన్ కమ్ ఓపెనర్ టెంబా బావుమా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నూరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా ఆటగాళ్లు వికెట్ పడకుండా ఆడారు. రూసో సెంచరీ చేయగా.. డికాక్ హాఫ్ సెంచరీ చేశాడు.
రూసో సెంచరీ
రూసో 56 బంతుల్లో 8 సిక్స్ లు, 7 ఫోర్లతో 109 పరుగులు చేయగా.. డికాక్ 38 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. 170 పరుగుల వద్ద డికాక్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టబ్స్ కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన షాట్‌ను లిట్టన్ దాస్ అందుకున్నాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. హసన్ మహ్మద్ సంధించిన చివరి ఓవర్‌లో అతను పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి సౌమ్యా సర్కార్ చేతికి చిక్కాడు.
షకీబుల్ హసన్
ఆ తర్వాత షకీబుల్ హసన్ బౌలింగ్ రూసో ఔటయ్యాడు. దీంతో చివర్ల సౌతాఫ్రికా జోరు తగ్గింది. బంగ్లా బౌలర్లలో షకీబుల్ హసన్ 2 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మహుముద్, హస్సేన్ ఒక్కో విటెట్ తీశారు. 206 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. లిట్టన్ దాస్ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications