టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో క్వాలిటీ సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ మినహా ఏ టోర్నీలో ఆడని ధోనీ.. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాడు. అనంతరం మాట్లాడుతూ ఫ్యాన్స్ కోసం మరొక్క ఐపీఎల్ ఆడాలని అనుకుంటున్నానని, అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరో ఏడాది ఉంది కదా అని కామెంట్ చేశాడు.
దీంతో వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ మళ్లీ మెయిన్‌స్ట్రీమ్ మీడియాకు దూరమైపోయాడు. అడపా దడపా విమానాల్లో కనిపించడమే తప్ప.. ఎక్కడా కనిపించడం లేదు కూడా. దీంతో అతని ఫ్యాన్స్ అందరూ.. ధోనీ గురించి, అతని కుటుంబం గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

ఎక్కడైనా ఈ స్టార్ గురించి తమకు తెలియని విషయాలు తెలుస్తాయని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కుమార్తె జీవా గురించి, ఆమె చదువుకునే స్కూల్ గురించి కూడా నెట్టింట వెతికేస్తున్నారు. జీవా ఎక్కడ చదువుకుంటోంది? ఆ స్కూల్ ఫీజు ఎంత? అని ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జీవా చదువుపై ధోనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.
ఏ విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండే ధోనీ.. జీవా కేవలం చదువులోనే కాకుండా స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్‌లో కూడా ముందుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో ధోనీ ఆడేటప్పుడు తండ్రిని చూడటానికి తల్లితో కలిసి స్టేడియానికి వచ్చే జీవా ఎక్కడ చదువుతోందని చాలా మంది ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు.
ఈ విషయంలో వినిపిస్తున్న వార్తలు నిజమని నమ్మితే.. జీవా ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని, ధోనీ సొంత ఊరు రాంచీలోనే చదువుకుంటోంది. ఇక్కడ ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జీవా మూడో క్లాస్ చదువుతోందని తెలుస్తోంది. ఈ స్కూల్‌లో జీవా చదువు కోసం ధోనీ ఏటా రూ.2.75 లక్షల ఫీజు కడుతున్నట్లు సమాచారం. తన గారాల పట్టి చదువు కోసం ధోనీ ఆ మాత్రం ఖర్చు పెడుతున్నాడంటే ఆశ్చర్యం లేదు.