ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!

Ind vs Aus 4th Test : History At Gabba,India Defeat Australia By 3 Wickets,Win Series 2-1

ముంబై: ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన సుదీర్ఘ పర్యటనకు ముందు టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. అసలు ఆస్ట్రేలియాకే వెళ్లమని, ఏం కావాలంటే అది చేసుకోమని హెడ్‌కోచ్‌ బీసీసీఐ అధికారులకు గట్టి హెచ్చరికలు పంపారట. ఈ విషయాన్ని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తాజాగా చెప్పడంతో.. అసలు విషయం ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ముచ్చటించిన సందర్భంగా శ్రీధర్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కుటుంబాలను అనుమతించం:

కుటుంబాలను అనుమతించం:

యూఏఈలో ఐపీఎల్‌ 2020 పూర్తయ్యాక భారత ఆటగాళ్లు 48 గంటలు క్వారంటైన్‌లో ఉన్నారని ఆర్‌ శ్రీధర్ చెప్పారు. అప్పటికే పలువురు ఆటగాళ్లు తమ కుటుంబాలతో సహా ఆసీస్‌ పర్యటనకు సిద్ధంగా ఉన్నారని, అయితే హఠాత్తుగా అక్కడి అధికారులు ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించమని చెప్పారన్నారు. రవిశాస్త్రి రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టి.. ఆటగాళ్లు తమ కుటుంబాలతో ఆసీస్‌కు వెళ్లేలా కృషి చేశారని శ్రీధర్‌ తెలిపారు.

బీసీసీఐ అధికారులకు గట్టి హెచ్చరికలు:

బీసీసీఐ అధికారులకు గట్టి హెచ్చరికలు:

'బీసీసీఐ అధికారులతో రవిశాస్త్రి తీవ్ర చర్చలు జరిపారు. ఈ విషయంలో మాకు రాత్రింబవళ్లు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించమని వారు స్పష్టం చేశారు. దాంతో మేము అసలు ఆస్ట్రేలియాకే వెళ్లమని, ఏం కావాలంటే అది చేసుకోమని శాస్త్రి బీసీసీఐ అధికారులకు గట్టి హెచ్చరికలు పంపారు' అని ఆర్‌ శ్రీధర్ చెప్పారు. అప్పుడు శాస్త్రి మాట్లాడుతూ 40 ఏళ్లుగా తాను ఆస్ట్రేలియాకు వెళ్తున్నానని.. వారితో ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసని చెప్పారన్నారు. చివరికి బీసీసీఐ.. క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఒప్పించడంతో అక్కడి అధికారులు అనుమతులు మంజూరు చేశారని శ్రీధర్‌ తెలిపారు.

అవన్నీ వదిలేయండి:

అవన్నీ వదిలేయండి:

బోర్డర్‌-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమిండియా 'డ్రా' చేసుకున్నవిషయం తెలిసిందే. అయితే ఐదవ రోజు ఆటలో అశ్విన్‌, విహారి మాత్రమే కీలకం కాదని.. శార్దూల్‌ ఠాకుర్‌ కూడా అంతే ముఖ్య పాత్ర పోషించాడని ఆర్‌ శ్రీధర్ పేర్కొన్నారు. 'ఐదవ రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవిశాస్త్రి.. శార్దూల్‌ను పిలిచి విహారిని ధాటిగా ఆడమని, మరో ఎండ్‌లో అశ్విన్‌ను వికెట్‌ కాపాడుకోమని చెప్పమన్నారు' అని‌ శ్రీధర్ తెలిపారు. 'శార్దూల్‌ మా వద్దకొచ్చి.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా విషయాలు చెప్పమని చెప్పారు. కానీ ఇప్పుడు నేనేం చెప్పను. అవన్నీ వదిలేయండి. మీరు ప్రస్తుతం బాగా ఆడుతున్నారు. ఇలాగే ఆడండి' అని చెప్పాడని ఆర్ అశ్విన్‌ స్పష్టం చేశాడు.

చారిత్రక విజయం:

చారిత్రక విజయం:

ఆసీస్ గడ్డపై టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌ను 2-1తో కోల్పోయినా.. టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో మాత్రం దుమ్మురేపింది. మొదటి టెస్టులో ఓడినా.. అద్భుతంగా పుంజుకుని 2-1 తేడాతో కంగారూలపై మరోసారి చారిత్రక విజయం సాధించింది. అంతకుముందు 2018-19 సీజన్‌లోనూ భారత్..‌ ఆస్ట్రేలియాపై బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ గెలుపొందిన సంగతి తెలిసిందే.

శాంసన్‌ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, January 23, 2021, 16:50 [IST]
Other articles published on Jan 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X