టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీతో తనని పోల్చవద్దని పాకిస్దాన్ వికెట్ కీపర్ ఉమర్ అక్మల్ అన్నాడు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చి టీమిండియాకు అధ్బుతమైన విజయాలను అందిస్తున్నాడని అన్నాడు.
తాను మాత్రం ఆరు, ఏడు స్దానాల్లో బ్యాటింగ్ కు వస్తున్నానని చెప్పుకొచ్చాడు. అదే విరాట్ కోహ్లీని ఆరు, ఏడు స్దానాల్లో బ్యాటింగ్ కు దిగి, నాకంటే మెరుగ్గా రాణించనమనండని అన్నాడు.

ఆ స్ధానాల్లో కూడా కోహ్లీ మెరుగ్గా రాణిస్తే, అప్పుడు తనతో నాకు పోలిస్తే ఒప్పుకుంటానని చెబుతున్నాడు. ప్రస్తుతం ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వరల్డ్ కప్ లో పాకిస్ధాన్ జట్టులో కెప్టెన్ మిస్బా తర్వాత చక్కగా రాణిస్తున్న విషయం తెలిసిందే.