For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్?: రాజస్థాన్ కెప్టెన్ వాట్సన్ సమాధానం..!

By Nageswara Rao

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8లో ఆస్టేలియా ఆటగాళ్లు ఎలాంటి స్లెడ్జింగ్ చేయడం లేదని రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ అన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆస్టేలియా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో ఆస్టేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడుతున్నారా అన్న ప్రశ్నకు గాను షేన్ వాట్సన్‌పై విధంగా స్పందించారు. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ ట్వంటీ20 టోర్నమెంట్ ఇంతగా సక్సెస్ అవడంతో విదేశీ ఆటగాళ్ల పాత్ర ఎంతో కీలకం, అందులోనూ ఆస్టేలియా ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Do Australians sledge each other at IPL 2015? - Shane Watson has the answer

ఐపీఎల్‌లో మొత్తం ఎనిమిది జట్లు ఆడుతుండగా, అందులో మూడు జట్లుకు కెప్టెన్లుగా ఆస్టేలియా ఆటగాళ్లే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్ధాన్ రాయల్స్ జట్టులో కెప్టెన్‌గా షేన్ వాట్స్ ఉంటే, స్టీవ్ స్మిత్, జేమ్స్ ఫల్కనర్ జట్టు సభ్యులుగా ఉన్నారు.

ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విషయానికి వస్తే జార్జి బెయిలీ కెప్టెన్‌గా ఉండగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ జాన్సన్, షాన్ మార్స్ జట్టు సభ్యులుగా ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులో మిచెల్ స్టార్క్ ఆడుతున్నాడు. సన్ రైజన్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ఆడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన మైఖెల్ హస్సీ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోన్ ఫించ్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 21న అహ్మదాబాద్ సర్ధార్ పటేల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ Vs రాజస్ధాన్ రాయల్స్ మ్యాచ్‌పై షేన్ వాట్సన్ స్పందించారు.

Do Australians sledge each other at IPL 2015? - Shane Watson has the answer

ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్టేలియా ఆటగాళ్ల మధ్య సద్భావన వాతావరణం నెలకొందని, ఇప్పటి వరకూ ఎలాంటి మాటల యుద్ధం నెలకొనలేదని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కవ మంది ఆస్టేలియా ఆటగాళ్లు ఆడుతున్నారని అన్నారు. ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లంతా ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటున్నామని అన్నారు.

గత 18 నెలలుగా ఆస్టేలియా జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య మంచి వాతావరణాన్ని మేం గడిపామని చెప్పారు. జట్టు సభ్యులే ప్రత్యర్ధులుగా ఆడటం బాగుందని అన్నారు. జాన్సన్ వేసిన బంతికి బౌల్ట్ అవడంపై మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి సూపర్ ఓవర్‌లో మేం ఉండటం సంతోషాన్ని కలగించిందన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మాకు తొలి ఓటమి అని అన్నారు.

ఇప్పటి వరకు రాజస్ధాన్ రాయల్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. ఆస్టేలియా తరుపున 2015 ఐసీసీ వరల్డ్ కప్ సాధించిన జట్టులో షేన్ వాట్సన్, మిచెల్ జాన్సన్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో మిచెల్ జాన్సన్ వేసిన తొలి బంతికే షేన్ వాట్సన్ పెవిలియన్‌కు చేరాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+