
సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా ఉండే టీమిండియా వెటరన్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసిన తర్వాత అతను ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. దీంతోనే భారత జట్టులో మళ్లీ పునరాగమనం కూడా చేశాడు. కానీ టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా రాణించే అవసరం లేకపోవడంతో టోర్నీ మధ్యలో నుంచి బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత నుంచి భారత క్రికెట్‌లోని పలు కీలక అంశాలపై తనదైన వివరణ ఇస్తూ అభిమానులకు చేరువయ్యాడు.
ఈ క్రమంలోనే తాజాగా తనను అభిమానులు ఏమైనా అడగాలి అనుకుంటే.. తనను డైరెక్టుగా అడగాలని డీకే చెప్పాడు. దీని కోసం 'ఆస్క్ డీకే' అని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. అయితే ఈ సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు డీకే సమాధానం చెప్పలేకపోయాడు. వెంటనే సదరు అభిమాని చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయాలని కోరాడు. అయితే ఇదంతా చాలా లైట్ మూడ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఏమైందంటే.. తనను అభిమానులు ఏమైనా అడగాలని అనుకుంటే వెంటనే అడగాలని డీకే చెప్పాడు. దీంతో చాలా మంది క్రికెట్ గురించి అతని విశ్లేషణలను అడిగాడు. వీరిలో ఒక అభిమాని మాత్రం డీకేను అవమానినంచాడు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్‌పై టీమిండియా ఏమాత్రం ఆడలేకపోయింది. డీకే కూడా ఈ మ్యాచ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యాడు.
ఈ క్రమంలో మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న డీకే కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. మామూలు మ్యాచుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఏదో క్షమించేయొచ్చు కానీ.. వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంత ఘోరంగా ఆడటం ఎలా సాధ్యమైందని సదరు అభిమాని అడిగాడు. ఈ విషయంపై ఏమైనా మాట్లాడాలని చెప్పాడు. అయితే ఇది చూసిన డీకే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. 'ముందు దీన్ని డిలీట్ చెయ్' అంటూ సరదాగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.