శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులు
ఇప్పటికే పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి అదరగొట్టిన వెస్టిండీస్, చెన్నైసూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ డేజే బ్రావో.. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మరోసారి స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. కొమిల్లా విక్టోరియన్స్ , ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొమిల్లా విక్టోరియన్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఫార్చ్యూన్ బారిషల్ తరఫున ఆడుతున్న బ్రావో 18వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో మహిదుల్ ఇస్లాం అంకాన్ భారీ షాట్‌కు ప్రయత్నించగా బంతి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతిలో వెళ్లి పడింది. దీంతో వికెట్ తీసిన ఆనందంలో శ్రీవల్లి సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ బ్రావో సంబరాలు జరపుకున్నాడు. పుష్ప మాదిరిగా వాక్ చేశాడు. అలాగే "గోయింగ్ విత్ ది ట్రెండ్!! davidwarner31 sureshraina3 నేను ఎలా చేశాను!!" అనే క్యాప్షన్‌తో వార్నర్, రైనాను అడిగిన బ్రావో.. మంగళవారం అదే శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసిన మరో వీడియోను పోస్ట్ చేశాడు.
వార్నర్, రైనా ఫన్నీ కామెంట్స్
ఈ రెండు వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు, చైన్నై సూపర్ కింగ్స్‌లో బ్రావో సహచరుడు సురేష్ రైనాతో పాటు, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించారు. వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "djbravo47 వెల్ డన్ బ్రావో" అని సురేష్ రైనా కామెంట్ చేయగా.. "హాహా లెజెండ్, యు ఆర్ ది మ్యాన్ బ్రదర్" అంటూ వార్నర్ కామెంట్ చేశాడు. కాగా రెండు రోజుల క్రితం కూడా శ్రీవల్లి పాటకు బ్రావో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు.

బ్రావో జట్టు ఓటమి
కాగా మ్యాచ్‌లో బ్రావో మొత్తం 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియా 20 ఓవర్లలో 158/7 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రావో టీం ఫార్చ్యూన్ బారిషల్ 95 పరుగులకే ఆలౌటై 63 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

కెరీర్‌కు గుడ్‌బై
గతేడాది చివర్లో ముగిసిన టీ20 వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌లో 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 5 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 363 వికెట్లు పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












