Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఔటయ్యాడని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం

Virat Kohli’

హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 పరుగులకే ఔటవడాన్ని ఓ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రాట్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. అతని వయసు 65 ఏళ్లు. పేరు బాబులాల్ బైరవా. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.... బాబులాల్ ఒక్కడే ఇంట్లో తొలి రోజు కేప్‌టౌన్ టెస్ట్‌ను చూస్తున్నాడు.

తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏదో చేస్తాడని ఆశగా ఎదురుచూశాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో బాబూలాల్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోగా.. అతని అరుపులు విని కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు.

వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కోహ్లి ఔటవడం వల్లే తాను అలా చేసినట్లు బాబులాల్ చెప్పినట్లు పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ అలావా చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 7, 2018, 19:59 [IST]
Other articles published on Jan 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+