Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు విరామం: కుమార మంగళం బిర్లా కుమారుడికీ తప్పని మానసిక సమస్య!

‘Distressed’ Aryaman Birla takes indefinite break from cricket

హైదరాబాద్: మానసిక ఆరోగ్య సమస్య. ఇటీవలి కాలంలో క్రికెటర్లను వేధిస్తోన్న ప్రధాన సమస్య. ఈ సమస్య కారణంగానే ఆస్ట్రేలియా అల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు మూడు నెలల పాటు విరామం ప్రకటించాడు. తాజాగా, ఈ జాబితాలో ఓ భారత క్రికెటర్ కూడా చేరాడు.

ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్‌ బిర్లా క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. మధ్య ప్రదేశ్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడుతోన్న మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

"గత కొంత కాలంగా నేను మానసికంగా తీవ్ర ఆందోళనతో ఉన్నా. సమస్యల వలయంలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంది. కాబట్టి నేను క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. క్రికెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. త్వరలో తిరిగి మైదానంలోకి అడుగుపెడుతా" అని ట్వీట్ చేశాడు.

ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ అయిన ఆర్యమన్‌ బిర్లా 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 27.60 యావరేజితో 414 పరుగులు చేశాడు. ఇక నాలుగు లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 36 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2018, 2019 సీజన్లలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వేలంలో అతడిని రాజస్థాన్‌ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.

అయితే, అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ 2020 వేలానికి ముందు రాజస్థాన్ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆర్యమన్ బిర్లా కూడా ఒకడు. కాగా, ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ బరిలోకి దిగకపోగా, గురువారం ముగిసిన ఐపీఎల్‌ వేలంలోనూ ఆర్యమన్ పాల్గొనకపోవడం విశేషం.

Story first published: Saturday, December 21, 2019, 15:30 [IST]
Other articles published on Dec 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+