స్పాట్ ఫిక్సింగ్: శ్రీనికి ఎదురుదెబ్బ, చెన్నై జట్టుని తొలగించమన్న సుప్రీం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎలాంటి విచారణ లేకుండా తొలగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సుప్రీం కోర్టు గురువారం కోరింది.
ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై
జస్టిస్ ముద్గల్ కమిటీపై విచారణ జరుపుతున్న అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిజమైన పెట్టుబడిదారులు వివరాలివ్వాలని ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడ్డ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురనాధ్ మేయప్పన్ 'ఇన్‌సైడర్ ట్రేడింగ్' మాదిరి ఉందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఐపీఎల్ వ్యవహారాలపై తీవ్రంగా మండిపడింది సుప్రీం కోర్టు. ఐపీఎల్‌లో ఎన్ శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాంచైజీ పెట్టుబడులపై ప్రశ్నించింది. అసలు రూ. 400 కోట్లతో చెన్నై ప్రాంచైజీని కొనాలన్న నిర్ణయం ఎవరిదన్న సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications