ఒక్క పరుగుతో 'డబుల్' సెంచరీ మిస్: ఆ 9 మంది వీరే
చెన్నై: చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. చెన్నై టెస్టులో కేఎల్ రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన చెన్నై టెస్టులో లోకేశ్ రాహుల్ 311 బంతులను ఎదుర్కొని 16 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 199 పరుగులు సాధించాడు. అయితే ఒక్క పరుగుతో డబుల్ సెంచరీని సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. తద్వారా రాహుల్ కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ కాగా, స్వదేశంలో మొదటిది.

52 ఏళ్ల తర్వాత రికార్డు బద్దలు
దీంతో 52 ఏళ్ల తర్వాత రికార్డుని బద్దలు కొట్టిన ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా అరుదైన ఘనతను సాధించాడు. రాహుల్ 193 పరుగులు వ్యక్తిగత స్కోరును సాధించే క్రమంలో బీకే కుందేరేన్ రికార్డును అధిగమించాడు.

అత్యధిక పరుగుల ఓపెనింగ్ రికార్డు
1964లో ఇంగ్లాండ్‌పై చెన్నైలో కుందేరేన్ 192 పరుగులతో భారత్ తరపున అత్యధిక పరుగుల ఓపెనింగ్ రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. 1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులో మొహమ్మద్ అజారుద్దీన్ 199 పరుగుల వద్ద రవి రత్నాయకే బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

డబుల్ సెంచరీ లేని అజారుద్దీన్
ఆ తర్వాత తాను ఆడిన 83 టెస్టుల్లో అజారుద్దీన్ ఈ స్కోరును అధిగమించలేకపోయాడు. అంతేకాదు తన కెరీర్‌లో ఒక్క డబుల్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక సెంచరీలు (22) చేసిన ఆటగాడిగా కూడా అజారుద్దీన్ నిలిచాడు. కాగా 199 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరిన ఆటగాళ్ల జాబితాలో ఏడుగురు క్రికెటర్లు ఉన్నారు.

మొత్తం ఏడుగురు
ముదస్సర్ నాజర్ (పాకిస్థాన్), మ్యాథ్యూ ఇలియట్ (ఆస్ట్రేలియా), జయసూర్య (శ్రీలంక), స్టీవ్ వా (ఆస్ట్రేలియా), యూనిస్ ఖాన్ (పాకిస్థాన్), ఇయాన్ బెల్ (ఇంగ్లాండ్), స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఆండీ ఫ్లవర్, కుమార సంగక్కర మాత్రం 199 స్కోరు వద్ద నాటౌట్‌గా నిలిచారు.
1. Mudassar Nazar (PAK) 199 vs India Faisalabad (24 Oct 1984)
2. Mohammed Azharuddin (INDIA) 199 v Sri Lanka Kanpur (17 Dec 1986)
3. Matthew Elliott (AUS) 199 v England Leeds (24 Jul 1997)
4. Sanath Jayasuriya (SL) 199 v India Colombo (SSC) (9 Aug 1997)
5. Steve Waugh (AUS) 199 v West Indies Bridgetown (26 Mar 1999)
6. Younis Khan (PAK) 199 v India Lahore (13 Jan 2006)
7. Ian Bell (ENG) 199 v South Africa Lord's (10 Jul 2008)
8. Steve Smith (AUS) 199 v West Indies Kingston (11 Jun 2015)
9. KL Rahul (INDIA) 199 v England Chennai (today Dec 18, 2016)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications