న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరికైనా సరే స్కూలు రక్షణ కల్పించేదిగా ఉండాలి: వైరల్ వీడియోపై వార్న్

Disgusting: Shane Warne On Syrian Refugee Being Bullied In School

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉన్న ఆల్మండ్‌బరీ కమ్యూనిటీ స్కూల్లో ఓ సిరియా శరణార్థిని మరో విద్యార్థి వేధిస్తున్న వీడియో. ఈ వీడియోలో ఉన్న సిరియా శరణార్థి విద్యార్ధి పేరు జమాల్.

<strong>'ఆర్డినరీ' ఆస్ట్రేలియాపై గెలిచేందుకు ఇదే సువర్ణావకాశం: ఇంజనీర్</strong>'ఆర్డినరీ' ఆస్ట్రేలియాపై గెలిచేందుకు ఇదే సువర్ణావకాశం: ఇంజనీర్

15 ఏళ్ల జమాల్‌ను మరొక విద్యార్ధి స్కూల్ మైదానంలో పడేసి మెడ మీద చేయి కొట్టడాన్ని మనం చూడొచ్చు. తాజాగా, ఈ వీడియో చూసిన ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఓ కామెంట్ పెట్టాడు.

"ఇది చాలా జుగుప్సాకరమైన ఘటన. దీనిపై వెంటనే ఏదో ఒకటి చేయండి. ఎవరికైనా సరే స్కూలు రక్షణ కల్పించే ప్రదేశంగా ఉండాలి" అని షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. గత నెలలో ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ, ఈ వీడియో ఇటీవలే వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్మండ్‌బరీ కమ్యూనిటీ స్కూలు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలో 15 ఏళ్ల జమాల్ అనే ఓ విద్యార్థిపై మరో విద్యార్థి చేయి చేసుకోవడంతో పాటు అతడి నోట్లో నీళ్లు పోస్తూ ఆనందాన్ని పొందాడు. దీనిని పక్కనే ఉన్న మరో విద్యార్థి వీడియో తీయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Story first published: Wednesday, November 28, 2018, 15:27 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X