Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌కు అత్యుత్తమ జట్టు ఉంది.. కప్ గెలువకపోతే నిరాశ చెందుతా

ICC Cricket World Cup 2019: Mohammad Azharuddin : ‘Disappointing If India Doesn’t Win The World Cup’
Disappointing if India doesn’t win the World Cup says Mohammad Azharuddin

ప్రపంచకప్‌కు ఎంపికయిన భారత జట్టు అత్యుత్తమైనది. ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉంది. ప్రపంచకప్‌ను భారత్‌ గెలువకపోతే నిరాశ చెందుతా అని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ తెలిపారు. మే 30 నుండి ప్రపంచకప్‌ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లు భారత జట్టుపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

జట్టు సమతూకంతో ఉంది

జట్టు సమతూకంతో ఉంది

ఈ క్రమంలో మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా టీమిండియా విజయావకాశాలపై స్పందించారు. 'ప్రపంచకప్‌ విజేతగా నిలిచేందుకు టీమిండియాకు ఇదే మంచి అవకాశం. మిగతా జట్లతో పోల్చితే.. ప్రస్తుతం మన జట్టు సమతూకంతో ఉంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్.. పేసర్లు, స్పిన్నర్లతో బౌలింగ్ బలంగా ఉంది. గతంతో చూసుకుంటే ఫీల్డింగ్‌ కూడా ఎంతో మెరుగయ్యింది' అని అజహరుద్దీన్‌ పేర్కొన్నారు.

కోహ్లీ గురించి ఆందోళన అనవసరం

కోహ్లీ గురించి ఆందోళన అనవసరం

'ప్రస్తుత భారత జట్టు అత్యుత్తమైనది. మన జట్టు కప్ గెలువకపోతే నిరాశ చెందుతా. కప్ తీసుకొస్తారనే నమ్మకం ఉంది. ఐపీఎల్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించకపోయినా ప్రపంచకప్‌లో పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. జీవితంలో ఒడిదొడుకులు సహజం. కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అజహరుద్దీన్‌ చెప్పుకొచ్చారు.

కప్ గెలిచే సత్తా భారత్‌కు ఉంది

కప్ గెలిచే సత్తా భారత్‌కు ఉంది

తాజాగా వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ... 'ప్రస్తుత జట్టును చూస్తే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్‌కు ఇది మంచి అవకాశం. విరాట్ సేన కప్ సాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమిండియా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఫైనల్ గురించి ఇప్పుడే అంచనా వేయలేను. టైటిల్ పోరులో నిలిచే సత్తా భారత్‌కు ఉంది. భారత క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. వారికి విజయం చేకూరాలని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నా' అని అన్నారు.

Story first published: Wednesday, May 8, 2019, 14:14 [IST]
Other articles published on May 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+