For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ప్రకటన: టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లివే

ICC T20 World Cup 2020 : Direct Qualifiers For World Cup Confirmed !
Direct qualifiers for ICC Mens T20 World Cup 2020 confirmed

హైదరాబాద్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై అయిన జట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఆయా జట్లు అర్హత సాధించాయి.

టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియాతో పాటు మరో 9 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇందులో టాప్-8 జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, మరో రెండు జట్లు మాత్రం ఆరు ఇతర జట్లతో గ్రూప్ స్టేజ్‌లో తలపడి ఈ రౌండ్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీ జరుగుతుంది. ఇందులో నాలుగు జట్లు సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. టాప్-10జట్లలో పాకిస్థాన్, ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించాయి.

శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో మరో ఆరు జట్లతో తలపడాల్సి ఉంటుంది. 2014లో చాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంక నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించకపోవడంపై ఆ టీమ్ కెప్టెన్ లసిత్ మలింగ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ 12 స్టేజ్‌కు తాము క్వాలిఫై అవుతామని శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల కెప్టెన్లు ధీమా వ్యక్తం చేశారు.

Story first published: Wednesday, January 2, 2019, 9:06 [IST]
Other articles published on Jan 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+