వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తీక్ vs రిషబ్ పంత్: స్పష్టం చేసిన ఎమ్మెస్కే

హైదరాబాద్: ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ కోసం తాము ఎంపిక చేయబోయే భారత జట్టులో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదని చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప‍్రసాద్ మరోసారి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. దినేశ్ కార్తీక్‌ను కేవలం టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు. వన్డేల్లో అతడి స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు.

వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్ ఆడటం అనుమానంగానే
దీంతో వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్ ఆడటం అనుమానంగానే మారింది. అంతేకాదు దినేశ్ కార్తీక్‌ను వరల్డ్‌కప్ జట్టు నుంచి తప్పించే క్రమంలోనే అతడిని ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కు ఎంపిక చేయలేదని విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "దినేశ్ కార్తీక్ వరల్డ్‌కప్ అవకాశం లేదనే విషయాన్ని మేం చెప్పలేదు కదా" అని అన్నారు.

టీమిండియాలో ఆరోగ్యకరమైన పోటీ
"ప్రస్తుత టీమిండియాలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. గత కొంతకాలంగా దినేశ్ కార్తీక్ మ్యాచ్ ఫినిషింగ్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి ఇచ్చినా అవకాశాల్ని కార్తీక్ సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. అయితే వికెట్ కీపర్ బ్యాకప్ స్లాట్ కూడా ముఖ్యమే కదా. దీంతో పంత్‌కు అవకాశాలు కల్పిస్తున్నాం. దినేశ్ కార్తీక్ ప్రదర్శనపై మాకు ఎటువంటి అనుమానం లేదు" ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

ఎక్కువ పరిణితి సాధించిన క్రికెటర్‌గా పంత్
"కానీ, రిషభ్ పంత్ కూడా ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పరిణితి సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇద్దరూ సమానంగానే వారి వారి అవకాశాల్ని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే సరైన సమయంలో జట్టు అవసరాన్ని బట్టి వారికి అవకాశాలు ఇస్తున్నాం" అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications