Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : గిల్‌కు జట్టులో చోటివ్వని వెటరన్.. అంత కుళ్లు ఎందుకంటూ ఫ్యాన్స్ ఫైర్!

Dinesh Karthik trolled for not picking Gill in his team

ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్ కోసం భారత జట్టు రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లోనే నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టులో ఎవరిని తీసుకోవాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా తన అభిప్రాయం వెల్లడించాడు.

డీకే జట్టు ఇదే..

డీకే జట్టు ఇదే..

తొలి టెస్టు ఆడే జట్టును ఎంపిక చేసిన డీకే.. రాహుల్, రోహిత్, పుజారాను టాపార్డర్‌లో ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్‌ను మిడిలార్డర్‌లో తీసుకున్నాడు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌ స్పిన్నర్లు కాగా.. షమీ, సిరాజ్ పేసర్లు. ఇదే తన జట్టు అని డీకే ప్రకటించాడు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడం అభిమానులకు నచ్చలేదు.

గిల్‌ కన్నా సూర్య ఎలా బెటర్?

గిల్‌ కన్నా సూర్య ఎలా బెటర్?

ఐపీఎల్‌లో డీకే కెప్టెన్సీలో కూడా గిల్ ఆడాడు. అయితే అతనికి టాపార్డర్‌లో డీకే అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్న అభిమానులు.. గిల్ అంటే ఎందుకు అంత కుళ్లు? అంటూ డీకేపై మండిపడుతున్నారు. అంత మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ను పక్కన పెట్టి, ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో కూడా అంత గొప్ప రికార్డు లేని సూర్యను ఆడించాలనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా డీకే కుళ్లును బయటపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ ఫామ్‌లో గిల్..

సూపర్ ఫామ్‌లో గిల్..

'అసలు గిల్‌తో నీ ప్రాబ్లం ఏంటి?' అని డీకేను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గిల్ తన కెరీర్ పీక్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో తన తొలి టెస్టు శతకం కూడా సాధించాడు. ఆ తర్వాత వన్డేల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఇటీవల ముగిసిన కివీస్‌ సిరీస్‌లో డబుల్ సెంచరీ కూడా బాదాడు. తాజాగా టీ20ల్లో కూడా సెంచరీ బాదిన అతను.. ఫార్మాట్ ఏదైనా సెంచరీలు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఎలా పక్కన పెట్టేస్తావని డీకేను ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. మరి టీమిండియా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Story first published: Wednesday, February 8, 2023, 11:58 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+