Dinesh Karthik: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ పునరాగమనం చేయబోతోన్నాడు. మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. ఎస్ఏ20 టోర్నమెంట్లను ఆడబోతోన్నాడు. పార్ల్ రాయల్స్ తరఫున ఈ టోర్నీలో మెరుపులు మెరిపించడానికి రెడీ అవుతున్నాడు.
గతంలో భారత్ తరఫున 180 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్‌పైనా తనదైన ముద్ర వేశాడు. కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ ఆడాడు దినేష్ కార్తీక్. ఆ తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాడు. మూడు సీజన్లుగా ఆ జట్టులో మెరుపులు మెరిపించాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ముగిసిన సీజన్‌తోనే రిటైర్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో కామెంటేటర్‌గా కనిపించాడు.

రిటైర్మెంట్ తరువాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025లో కొత్త అవతారంలో కనిపించబోతోన్నాడు. మొన్నటివరకు తాను ప్రాతినిథ్యాన్ని వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోనే డిఫరెంట్ రోల్‌లో ముందుకు రానున్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా అపాయింట్ అయ్యాడు దినేష్ కార్తీక్.
అదే సమయంలో ఆయనకు ఎస్ఏ20 నుంచి ఆహ్వానం అందింది. పార్ల్ రాయల్స్ తరఫున జూలు విదిలించనున్నాడు. ప్రస్తుతం స్కై స్పోర్ట్స్ తరఫున 100- ఫార్మట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఎస్ఏ20 టోర్నమెంట్ కోసం ఆయనను తమ జట్టులోకి తీసుకున్నట్లు పార్ల్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ టీమ్ తరఫున ఎస్ఏ20 ఆడబోతోన్న తొలి భారత క్రికెటర్ ఆయనే.
పార్ల్ రాయల్స్ టీమ్‌లో- డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, జోర్న్ ఫొర్టున్, ఫెహ్లుక్వాయో, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మిఛెల్ వాన్ బురెన్, కోడి యూసుఫ్, కీత్ డడ్గెయిన్, నకాబా పీటర్, క్వెనా మఫాకా, లువాన్-డ్రె ప్రిటోరియస్ సెలెక్ట్ అయ్యారు. డయ్యాన్ గాలియం కోసం సంప్రదింపులు జరుపుతోంది మేనేజ్‌మెంట్.