IPL 2022: సీఎస్కేలోకి దినేష్ కార్తీక్.. మనసులోని మాట బయటపెట్టిన వెటరన్ వికెట్ కీపర్

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో వేలంలో ఏ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేస్తోందననే ఆసక్తి పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో పలువురు ఆటగాళ్లు తమకు వేలానికి ముందే పలానా జట్లకు ఆడాలని ఉంది అంటూ మనసులోని మాటను బయటపెట్టేస్తున్నారు. ఇందులో మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని కోరుకునే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. తాజాగా ఈ లిస్టులో ఓ టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కూడా చేరిపోయాడు.

దినేశ్ కార్తీక్ మనస్సులోని మాట
36 ఏళ్ల టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ 2022లో మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని 4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని ఉందని తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. తాను తన సొంత రాష్ట్రమైన సీఎస్కే తరఫున ఆడగలిగితే అది చాలా గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు. కానీ అది జరగడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. అయితే తనకు నచ్చిన జట్టును ఎంచుకోవడం చాలా కష్టమన్నాడు. కాగా ఈ నెల 12, 13వ తేదీలలో బెంగళూరు వేదికగా జరగనున్న మెగా వేలం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు. అలాగే టోర్నీలో మంచి ప్రదర్శన కనబర్చడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.

6 జట్లకు ఆడిన కార్తీక్
14 ఏళ్ల ఐపీఎల్ సీజన్లలో ఇప్పటివరకు దినేశ్ కార్తీక్ 6 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ సొంత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన చెన్నైసూపర్ కింగ్స్‌కు మాత్రం ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం వహించలేకపోయాడు. అందుకే ఈ సారి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నాడు. ఇందుకోసం తనను వేలంలో చెన్నై కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాడు. కాగా ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఈ ఏడాది కోల్‌కతా రిటెన్షన్ జాబితాలో కార్తీక్‌కు చోటు దక్కలేదు.

ముంబైలో ప్రాక్తీస్
ఐపీఎల్‌లో తాను ఆడే ప్రాంచైజీ కోసం చేయగలినదంతా చేస్తానని కార్తీక్ చెప్పాడు. తాను చెన్నైకి చెందిన వాడినని అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తన స్నేహితుడు, గురువు అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ముంబైలోని హార్డ్ యార్డ్స్ టీ20 ఫార్మాట్‌లో తన ఫినిషింగ్ నైపుణ్యాలకు పదును పెట్టడంపై దృష్టి సారించినట్లు చెప్పాడు. కాగా టీమిండియాలోకి రీఎంట్రీపై ఆసక్తి కనబరుస్తున్న దీనేశ్ కార్తీక్ ఇటీవల ఆ దిశగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియాలో టీ20 ఫార్మాట్లో సరైన ఫినిషర్ లేడని, తాను ఆ లోటు తీర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయసులో టీమిండియాలో శిఖర్ ధావన్ రాణిస్తున్నాడని గుర్తు చేశాడు. అలాగే పాకిస్థాన్ ప్లేయర్లు మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ 40 ఏళ్ల వయసులో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని చెప్పుకొచ్చాడు.

కార్తీక్ రికార్డులు
ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ ఇప్పటివరకు 213 మ్యాచ్‌లు ఆడాడు. 25 సగటుతో 4046 పరుగులు చేశాడు. ఇందులో 19 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 97 పరుగులు. ఈ క్రమంలో 399 ఫోర్లు, 112 సిక్స్‌లు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications