For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేవలం భారతదేశంలోనే అలా చూస్తారు.. అలాంటి మూస ధోరణిని మార్చాలనుకుంటున్నా! మళ్లీ ఏసేసిన డీకే!

Dinesh Karthik said Commentary in India is considered a post retirement option, I want to change that
ENG vs SL 2021 : 'Commentary Is A Post-Retirement Option Only In India' - DK | Oneindia Telugu

ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో వ్యాఖ్యాతగా మారిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతవారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా అతడికి వ్యతిరేకత ఎదురైంది. ఆపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఒక్క భారతదేశంలోనే వ్యాఖ్యానాన్ని రిటైర్మెంట్‌ తర్వాత చేసే పనిగా భావిస్తారని కార్తీక్‌ అన్నాడు.

భారత్‌లోనే బిన్నంగా చూస్తారు:

భారత్‌లోనే బిన్నంగా చూస్తారు:

తాజాగా దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ... 'వ్యాఖ్యాతగా క్రికెట్‌ గురించి నాకు తెలిసింది మాట్లాడాలనుకున్నా. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ టెన్నిస్ వంటి ఇతర క్రీడల్లో.. ఆటగాళ్లు తాము ఆటకు దూరంగా ఉన్నప్పుడు వాఖ్యానం చేస్తుంటారు. శ్రీలంక, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో జేమ్స్‌ అండర్సన్‌ కూడా బీబీసీ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుత ఆటగాళ్లు వ్యాఖ్యానం చేయడం ప్రపంచ వ్యాప్తంగా సాధారణమే. ఒక్క భారత్‌లోనే అది రిటైర్మెంట్‌ అనంతరం చేసే పనిగా పరిగణిస్తారు. అలాంటి మూస ధోరణిని మార్చాలనుకుంటున్నా. నేను జట్టులో లేనప్పుడు సంతోషంగా కామెంట్రీ చెబుతా' అని అన్నాడు.

 వ్యాఖ్యానంలో చాలా ఫన్ ఉంది:

వ్యాఖ్యానంలో చాలా ఫన్ ఉంది:

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌కు తోడుగా దినేశ్‌ కార్తీక్‌ వ్యాఖ్యానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ... 'వ్యాఖ్యానంలో సునీల్‌ గవాస్కర్‌ చాలా టిప్స్ చెప్పారు. అది పక్కనపెడితే.. సన్నీతో ఉన్న సమయంను బాగా ఎంజాయ్ చేశా. వ్యాఖ్యానంలో చాలా ఫన్ ఉంది. నాజర్ హుస్సేన్, మైఖేల్ ఆర్థర్ వంటి వారి పక్కన కూర్చుని కామెంటరీ చెప్పడం గౌరవంగా భావిస్తున్నా. దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2021 కోసం ఎదురుచూస్తున్నా. కల్‌కత్తా తరఫున బాగా రాణించాలని కోరుకుంటున్నా' అని డీకే అన్నాడు. కార్తీక్‌ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు.

 మరో 3-4 సంవత్సరాలు ఆడుతా:

మరో 3-4 సంవత్సరాలు ఆడుతా:

'నేను ఫిట్‌గా ఉన్నంత కాలం ఆడటం కొనసాగిస్తా. మరో 3-4 సంవత్సరాలు ఆడుతా. నాకు మంచి ఫిట్‌నెస్ ఉంది. ఎందుకు ఆడకూడదు అనే దానికి ఎటువంటి కారణం లేదు. టీ20ల్లో నేను గతంలోనే కాదు.. ఇప్పుడు కూడా బాగా ఆడుతున్నా. నిజమే 2019 వన్డే ప్రపంచకప్‌లో అంచనాల్ని అందుకోలేకపోయాను. కానీ టీ20ల్లో అప్పటి వరకూ మెరుగ్గా ఆడాను. మరి టీ20ల్లోనూ ఎందుకు 2019 ప్రపంచకప్‌ నుంచి పక్కన పెడుతున్నారు. భారత సెలెక్టర్లు వయసుని చూడటం లేదు. కేవలం ఫిట్‌నెస్‌, ఆటని చూస్తున్నారు. నీకు ఫిట్‌నెస్ టెస్టుని నిర్వహిస్తున్నారంటే.. టీమిండియాకి ఆడే సామర్థ్యం నీకు ఉందని వాళ్లు విశ్వసించినట్లే కదా?. బ్యాక్ టు బ్యాక్ టీ20 ప్రపంచకప్‌లు జరగబోతున్నాయి. ఈ రెండు మెగా టోర్నీల్లో ఆడాలని ఆశిస్తున్నా. అందులో భాగం కావడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నా' అని డీకే తెలిపాడు.

 2019 నుంచి వేటు:

2019 నుంచి వేటు:

ఎంఎస్ ధోనీ కంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా మాత్రం కొనసాగలేకపోయాడు. ధోనీ వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే టీమ్‌లోకి ఎంపికవుతూ వచ్చిన కార్తీక్.. ఆ తరవాత టీమిండియాకి పూర్తిగా దూరమైపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున నిలకడగా ఆడుతూ వచ్చిన కార్తీక్.. 2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత ఒక్కసారిగా హీరో అయ్యాడు. తర్వాత 2019 వన్డే ప్రపంచకప్‌కి కూడా భారత సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌‌లో నెం.5 స్థానంలో బ్యాటింగ్‌కి దిగి.. 25 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి కార్తీక్‌పై వేటు కొనసాగుతోంది.

Story first published: Thursday, July 8, 2021, 9:09 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+