
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి భారత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తప్పుకున్నాడు. గాయం కారణంగా సెంచూరియన్ టెస్టుకు దూరమైన సాహా తాజాగా మూడో టెస్టుకు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో మూడో టెస్టుకు సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ని ఎంపిక చేశారు.
మూడో టెస్టు ప్రారంభానికి ముందే దినేశ్ కార్తీక్ జట్టుతో కలవనున్నాడు. జనవరి 11 (గురువారం) నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సాహాకు గాయమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ మెడికల్ టీమ్ సాహా పరిస్థితిని పర్యవేక్షించి దక్షిణాఫ్రికా టూర్‌లో కొనసాగించాలా? వద్ద అన్న నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో సాహా స్ధానంలో పార్ధీవ్ పటేల్ కీపర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా.. వికెట్ కీపర్‌గా సాహా రాణించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకంజలో ఉంది.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయగా, భారత్ 307 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డివిలియర్స్ (50), డీన్ ఎల్గర్ (36) పరుగులతో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.