IND vs SA: సూర్య చేసిన ఆ తప్పిదంతోనే ఓడాం: డీకే
గెబేహా వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీస్‌లో 1-1తో భారత్ ఆధిక్యాన్ని సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 45 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) చెమటోడ్చాడు.సఫారీ బౌలర్లలో మార్కో జేన్సన్, కొయెట్జీ, సిమలెనే, మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓ దశలో దక్షిణాఫ్రికా 16 ఓవర్లకు 88/7తో ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో, 7 ఫోర్లు), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్త అయిదు వికెట్లతో పోరాడాడు. అయితే టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, దినేశ్ కార్తీక్ విశ్లేషించారు.

డెత్ ఓవర్లలో పేలవ బౌలింగ్ ఓటమికి కారణంగా చెప్పలేమని జహీర్ ఖాన్ అన్నాడు. మ్యాచ్ 19వ ఓవర్ వరకు వచ్చిందంటే దానికి కారణం బౌలర్ల క్రమశిక్షణ బౌలింగేనని తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమన్నాడు. మరో 15-20 పరుగులు చేసి ఉంటే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని జహీర్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై దినేశ్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్‌కు కనీసం మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అక్షర్ ఒకే ఓవర్ బౌలింగ్ చేసి నాలుగు బంతుల్ని డాట్స్‌గా మలిచి రెండు పరుగులే ఇచ్చాడని, 15వ ఓవర్ హార్దిక్ పాండ్యకు బదులుగా అక్షర్‌తో బౌలింగ్ చేయించాల్సిందని డీకే అన్నాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్‌కు వచ్చి దక్షిణాఫ్రికాను మరింత కట్టడిచేసేవాడని పేర్కొన్నాడు.
15వ ఓవర్‌లో హార్దిక్‌తో 9 పరుగులు ఇచ్చాడు. తర్వాత ఓవర్‌లో రవి బిష్ణోయ్ ఒక్క వికెట్ తీసి 4 పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాతి మూడు ఓవర్లలో అర్షదీప్ సింగ్ 12 పరుగులు (17వ ఓవర్), 16 పరుగులు (19వ ఓవర్), అవేశ్ ఖాన్ 12 పరుగులు (18వ ఓవర్) సమర్పించుకున్నారు. 10వ ఓవర్ వేసిన అక్షర్‌కు సూర్య మరోసారి బంతి ఇవ్వలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications