Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బా.. ఎమన్నా ఉందా ఆ సినిమా! ప్రతి సన్నివేశానికి పడిపడి నవ్వాను: దినేష్ కార్తీక్

Dinesh Karthik Praises Recent Blockbuster Jathi Ratnalu During IPL 2021

హైదరాబాద్: చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జాతి రత్నాలు' సినిమా పెద్ద విజయాన్నే సాధించింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతి రత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కరోనా మహమ్మారి భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ఈ సినిమా 'కామెడీ టీకా' ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దుమ్ము లేపిన జాతి రత్నాలు.. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది.

జాతి రత్నాలుపై డీకే ప్రశంసలు:

'జాతి రత్నాలు' చూసిన ప్రతిఒక్కరు ఆ సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీ వారే కాకుండా.. రాజకీయ నాయకులు, క్రికెటర్లు కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా జాతి రత్నాలు సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సినిమా బాగుందని, డైలాగ్స్ సూపర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని డీకే పేర్కొన్నాడు. డీకేకు తెలుగు కూడా వచ్చన్న విషయం తెలిసిందే.

 ఏమా నవ్వుల అల్లర్లు:

ఏమా నవ్వుల అల్లర్లు:

'ఓ మై గాడ్.. ఏమా నవ్వుల అల్లర్లు. నేను ప్రతి సన్నివేశంకు నవ్వాను. సినిమాలో అద్భుత డైలాగ్స్ ఉన్నాయి. సూపర్ డైరెక్షన్. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. 'జాతి రత్నాలు' మంచి ఉల్లాసాన్ని ఇచ్చింది. ఇలా నవ్వించడం చాలా కష్టం. కానీ మీరు బాగా చేశారు. ఎంత కష్టపడ్డారో తెరపై తెలుస్తుంది. ఔట్ స్టాండింగ్ ఫెర్ఫామెన్స్' అని కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ త ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ కూడా 'జాతిరత్నాలు'పై ప్రశంసల జల్లు కురిపించారు.

 బంపర్ హిట్:

బంపర్ హిట్:

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం 'జాతి రత్నాలు'. అనుదీప్‌ కేవీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు. టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో అప్పటికే ప్రేక్షకులకు దగ్గరైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బంపర్ హిట్ కొట్టింది. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపింది. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'చిచ్చోరే' వంటి చిత్రాలతో హిట్‌ కొట్టిన హీరో నవీన్‌ పొలిశెట్టి.. జాతి రత్నాలుతో హ్యాట్రిక్ కొట్టాడు.

బెంగళూరుతో ఢీ:

బెంగళూరుతో ఢీ:

మంగళవారం చెన్నైలోని చిదంబరం మైదానంలో ముంబైతో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా ఓడిపోయిన విషయం తెలిసిందే. 31 బంతుల్లో 30 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. క్రీజులో ఉన్నది ఆండ్రీ రస్సెల్‌, దినేశ్‌ కార్తీక్! అయినా కోల్‌కతా మ్యాచ్ ఓడిపోయింది. తొలి మ్యాచులో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఇక ఆదివారం మూడో మ్యాచులో బెంగళూరుతో కోల్‌కతా తలపడనుంది.

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. 1980కి కపిల్‌ దేవ్‌, 1990కి సచిన్‌ ఎంపిక!!

Story first published: Friday, April 16, 2021, 19:20 [IST]
Other articles published on Apr 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+