
హైదరాబాద్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలిరోజు ఆటలో భారత్‌కు శుభారంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను అదుపు చేయగలిగారు. తొలి రోజు ఆట ముగిసేసరికి 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేలవరీతిలో రనౌట్ చేశాడు.
ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీ చేతుల మీదుగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఈ గేమ్ మొత్తంలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగలిగాడు. భారత్‌కు మొత్తం 9వికెట్లు చిక్కితే అందులో నాలుగూ అశ్విన్ తీసినవే. ప్రతి పరిమిత ఓవర్ల సిరీస్ మ్యాచ్‌లకు వికెట్ కీపర్‌గా వ్యవహరించే ధోనీ టెస్టులకు రాజీనామా ప్రకటించడంతో.. ఆ స్థానంలో కీపర్‌గా ఆడిన దినేశ్ కార్తీక్ బౌలర్లకు ధోనీ అంత కాకపోయినా తరచూ సలహాలిస్తూ నడిపించాడు. ఇదే క్రమంలో రవిచంద్రన్ అశ్విన్‌కు బౌలింగ్ వేసిన ప్రతి సారీ మాతృభాష తమిళంలో మాట్లాడుతూ.. ఎంకరేజ్‌మెంట్‌ను అందించాడు.
తొలి రోజు 60 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆతిథ్య జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కుక్‌ను బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చిన అశ్విన్.. బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, స్టువర్ బ్రాడ్‌లను పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బౌలింగ్ అటాక్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వకుండా చేశాడు.
ఇలా అశ్విన్‌కు ఎంకరేజ్‌మెంట్ ఇస్తున్న క్రమంలోనే కార్తీక్ అతణ్ని యాష్లే అంటూ సంభోదించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ పేరును అశ్విన్‌కు ఆపాదించాడు. సరిగ్గా ఈ మాటలను విని తమిళనాట ప్రజలంతా తమ సంతోషాన్ని ట్వీట్ల ద్వారా బయటపెడుతున్నారు. మ్యాచ్ లోని 17వ ఓవర్లో అశ్విన్‌కి అది ఆరో ఓవర్.. 'బాగా బౌలింగ్ చేశావు. మిగిలిన బంతులు కూడా అలాగే వెయ్యి.' అంటూ తమిళంలో చెప్పాడు.