న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దినేశ్ కార్తీక్.. దీపికా పల్లికల్‌లు ఎక్కడ.. ఏం చేస్తున్నారు?

Dinesh Karthik and Dipika Pallikal love story

న్యూఢిల్లీ: పెళ్లైన ఇన్నేళ్లకు దినేశ్ కార్తీక్.. దీపికా పల్లికల్‌ల జోడి విహారయాత్రకు బయల్దేరింది. ఇద్దరూ క్రీడా రంగంలో ఉన్నవాళ్లే. అయినా కలిసి గడిపేందుకు సమయం తక్కువగా ఉంటుంది. దీంతో దినేశ్ కార్తీక్-దీపికా పల్లికల్ జోడీ.. న్యూయార్క్‌కు పయనమైంది. ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేయడంలో దేశంలోని మిగతా సెలబ్రెటీ కపుల్స్ కంటే ముందే ఉంటారు.

దినేష్ కార్తీక్..సతీమణితో న్యూయార్క్‌ నగరాన్ని

దినేష్ కార్తీక్..సతీమణితో న్యూయార్క్‌ నగరాన్ని

తన ఎన్నో ఏళ్ల కలను దినేష్ ఎట్టకేలకు నెరవేర్చడంతో దీపికా పల్లికల్ ఆనందానికి అడ్డే లేదట!! ఎప్పుడూ టేబుల్ టెన్నిస్ టోర్నీలు ఆడటం కోసం ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మాత్రమే న్యూ యార్క్ సిటీలో పర్యటించిన దీపికా తొలిసారిగా భర్త దినేష్‌తో కలిసి వెళ్లింది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కని దినేశ్ కార్తీక్..సతీమణితో కలిసి న్యూయార్క్‌ నగరాన్ని చుట్టేశాడు.

 తన కల నెరవేరిందని దీపికా పల్లికల్

తన కల నెరవేరిందని దీపికా పల్లికల్

ఇద్దరూ కలిసి సిటీ ఆఫ్ డ్రీమ్స్‌గా పేరున్న న్యూయార్క్‌ నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. సిటీ ఆఫ్ డ్రీమ్స్‌లో తన కల నెరవేరిందని దీపికా పల్లికల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. న్యూయార్క్ టూర్‌లో భర్త దినేశ్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.

 భర్తతో కలిసి మధుర క్షణాలు గడిపానని

భర్తతో కలిసి మధుర క్షణాలు గడిపానని

తాను ఎన్నో సంవత్సరాలుగా టేబుల్ టెన్నిస్ టోర్నీల కోసం అనేక సార్లు న్యూయార్క్ వచ్చానని...కానీ ఈ సారి టూర్ మరింత ప్రత్యేకమని సంబరపడిపోతూ చెప్పింది. భర్తతో కలిసి తనకెంతగానో నచ్చిన నగరాల్లో ఒకటైన న్యూయార్క్ సిటీని సందర్శించి... మధుర క్షణాలు గడిపానని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

 న్యూయార్క్‌ డ్రీమ్ డేట్‌ ఫోటోస్

న్యూయార్క్‌ డ్రీమ్ డేట్‌ ఫోటోస్

టీమిండియా క్రికెటర్‌గా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా దినేశ్ కార్తీక్, భారత టేబుల్ టెన్నిస్ క్వీన్‌గా దీపికా పల్లికల్‌ తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నారు. దినేశ్-దీపికాల జోడీ న్యూయార్క్‌ డ్రీమ్ డేట్‌ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రీడాభిమానులను అలరిస్తున్నాయి.

Story first published: Tuesday, October 9, 2018, 16:50 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X