Dinesh Karthik: దినేష్ కార్తీక్ చివరి టీ20 మ్యాచ్ ఆడేశాడా..! ఎందుకంటే..

దినేష్ కార్తీక్ పడిలేచిన కెరటం అని చెప్పుకోవచ్చు. 37 సంవత్సరాల వయస్సులో దినేష్ కార్తీక్ సంవత్సరం క్రితం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటించినప్పుడు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కానీ.. ఐపీఎల్ రాణించి టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. అయితే ఈ వరల్డ్ కప్ కార్తీక్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. దీంతో అతడిని న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టూర్ కు ఎంపిక చేయలేదు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అతను గాయపడ్డాడు. మిగిలిన మ్యాచ్ ల్లో కార్తీక్ ఆడడంపై స్పష్టత రావాల్సి ఉంది.

న్యూజిలాండ్
T20 ప్రపంచ కప్ ప్రచారం ముగిసిన దాదాపు వారం తర్వాత, నవంబర్ 18 నుంచి ఇండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, మూడు టీ20 ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్టర్లు ఆదివారం జట్టును ప్రకటించారు. సెలెక్టర్లు రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపింగ్ ఎంపికలుగా ఎంచుకున్నందున కార్తీక్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అంటే కార్తీక్ ఇండియా కెరీర్ ముగిసిపోతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2024
కార్తీక్ తన పనిభారాన్ని తగ్గించడానికే ఎంపిక చేయలేదని BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చెప్పాడు. అయితే సెలెక్టర్లు ఇప్పుడు ప్రపంచ కప్ తదుపరి ఎడిషన్ కోసం వేరే సెటప్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు."మేము T20 ప్రపంచకప్ తర్వాత వేరే సెటప్‌ని ప్రయత్నించాలనుకుంటున్నాము. అతని కోసం తలుపులు తెరిచి ఉన్నాయి, "అని చేతన్ చెప్పాడు. తదుపరి T20 ప్రపంచకప్ 2024లో వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్‌లో జరగనుంది.

న్యూజిలాండ్ తో జరిగే భారత్ టీ20 జట్టు
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), సంజ్ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీద్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రన్ మాలిక్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications