Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత బ్యాటింగ్ లైనప్‌ను డాబర్‌మన్ కుక్కతో పోల్చిన డీకే.. ఎందుకంటే..!

Dinesh Karthik: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా పరాజయం పాలైంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలి మ్యాచ్‌లోనే భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ లైనప్‌లో భాగంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్ల పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఒక వింత వ్యాఖ్య చేశారు. భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌ను డాబర్‌మన్ కుక్కతో పోల్చాడు.

టీమిండియా లోయర్ ఆర్డర్ వైఫల్యం
మొదటి టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 149 పరుగుల సహాయంతో ఆతిథ్య జట్టు 371 పరుగల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమికి టీమిండియా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమై ఇంగ్లాండ్ జట్టుకు తిరిగి పుంజుకునే అవకాశం ఇచ్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ తమ చివరి 7 వికెట్లను 41 పరుగులకే కోల్పోగా.. రెండో ఇన్నింగ్స్‌లో చివరి 6 వికెట్లు 31 పరుగులకే పడిపోయాయి.

Dinesh Karthik compares Indian batting to a Doberman dog Here s why

రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి తెచ్చే అవకాశం టీమిండియాకు ఉంది. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన ఈ ప్లాన్‌ను పాడు చేసింది. చివరికి ఈ తప్పు భారత్‌కు భారీగా నష్టం కలిగించింది. ఎందుకంటే ఈ తప్పిదం చివరికి టీమిండియా ఓటమికి దారితీసి టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సాధించడానికి కారణమైంది.

దినేశ్ కార్తీక్ వింత వ్యాఖ్యలు
టీమిండియా లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంపై నెట్టింట తీవ్రచర్చ జరుగుతోంది. జట్టుకు అత్యవసరం అయిన సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ డాబర్‌మన్ కుక్కలా ఉందని ఎవర్ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారని పేర్కొన్న దినేష్ కార్తీక్.. డాబర్‌మన్ కుక్క తలభాగం బాగుంటుందని.. మధ్యభాగం పర్లేదని.. కానీ తోక మాత్రం అస్సలు ఉండదని.. భారత బ్యాటింగ్ తీరును విశ్లేషించాడు. ఇది వన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ఇయాన్ వార్డ్, మైఖేల్ అథెర్టన్‌లు గట్టిగా నవ్వేశారు.

Story first published: Thursday, June 26, 2025, 13:46 [IST]
Other articles published on Jun 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+