పంత్‌కి దక్కని చోటు: వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ ఎంపికపై ఎమ్మెస్కే క్లారిటీ!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
బ్యాకప్ వికెట్ కీపర్‌గా సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌నే ఎంపిక చేశారు. బ్యాకప్ వికెట్ కీపర్ విషయంలో గత కొంతకాలంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, చివరకు సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌కే ఓటేయడానికి కారణం అతడి అనుభవమే. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కొనడంలో దినేశ్ కార్తీక్ దిట్ట అని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.
దినేశ్ కార్తీక్‌కు ఎక్కువగా ఉంది
వికెట్ కీపింగ్ చేసే సామర్థ్యం కూడా దినేశ్ కార్తీక్‌కు ఎక్కువగా ఉందని చెప్పాడు. నిజానికి బ్యాకప్ వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్ నుంచి కూడా గట్టి పోటీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చివరకు అనుభవం, ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం ఉన్న దినేశ్ కార్తీక్‌వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా ధోనినే వికెట్ కీపింగ్ చేస్తాడని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

ధోని గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైతే!
ఒకవేళ ధోని గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైతే అప్పుడు వికెట్ కీపింగ్ బాధ్యతలను దినేశ్ కార్తీక్ నిర్వర్తిస్తాడని తెలిపాడు. "ధోనీ గాయపడితే.. పంత్ కానీ, కార్తీక్‌ని కానీ జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందని అంతా అనుకున్నాం. ముఖ్యమైన మ్యాచ్‌లోవికెట్ కీపింగ్ చాలా ముఖ్యం. అందుకే పంత్‌కి బదులు దినేశ్ కార్తీక్‌ని జట్టులోకి తీసుకున్నాం. లేకుంటే పంత్‌కే అవకాశం ఇచ్చే వాళ్లం" అని ఎమ్మెస్కే తెలిపాడు.

కేఎల్ రాహుల్‌ని బ్యాకప్ ఓపెనర్‌గా
కేఎల్ రాహుల్‌ని బ్యాకప్ ఓపెనర్‌గా ఉంటాడని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. అవసరాన్ని బట్టి.. రాహుల్ సేవలను వాడుకుంటామని ఎమ్మెస్కే అన్నారు. ఇక, హార్థిక్ పాండ్యా వెన్ను గాయం తీవ్రత లేదని, కానీ ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆస్ట్రేలియా సిరీస్‌కు పాండ్యాను దూరం పెట్టనట్లు ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.

వరల్డ్‌కప్ కోసం అదనంగా నలుగురు మీడియం పేస్ బౌలర్లను
వరల్డ్‌కప్ కోసం అదనంగా నలుగురు మీడియం పేస్ బౌలర్లను కూడా ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే తెలిపారు. జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్టర్లు సోమవారం ఉదయం బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హాజరయ్యాడు.
వరల్డ్‌కప్‌కు భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications