న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్‌తో పోల్చిన దినేశ్ కార్తీక్

Dinesh Karthik calls Ravi Ashwin by the former Australian off-spinners name

హైదరాబాద్: ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్‌ చతికిలబడింది. ఆట ఆఖరుకు 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేలవరీతిలో రనౌట్ చేశాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీ చేతుల మీదుగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు.

తొలి రోజు 60 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆతిథ్య జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. కుక్‌ను బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చిన అశ్విన్.. బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, స్టువర్ బ్రాడ్‌లను పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బౌలింగ్ అటాక్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వకుండా చేశాడు.

1
42374

బ్యాట్స్‌మెన్ ఊహించని రీతిలో బంతులేసిన అశ్విన్‌ను వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ నిరంతరం ఉత్సాహపరిచాడు. అతడు బౌలింగ్‌కు దిగినప్పుడు తమిళంలో మాట్లాడుతూ, సలహాలిస్తూ ఎంకరేజ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌కు ముగ్ధుడైన కార్తీక్.. అతణ్ని 'యాష్లే' అని పిలిచాడు.

ఇదేదో ముద్దుపేరు కాదు. యాష్లే మాల్లెట్‌ ఆసీస్ మాజీ బౌలర్. కౌంటీల్లో బెస్ట్ ఆఫ్ స్పిన్నర్‌గా అతడికి పేరుంది. ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టులు ఆడిన అతడు 132 వికెట్లు పడగొట్టాడు. యాష్లేతో పోల్చడం ద్వారా అశ్విన్‌ను మరింత ఉత్సాహపరిచేందుకు కార్తీక్ ప్రయత్నించాడు. ఇలా తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బౌలర్లు ఇంగ్లాండ్ ఆటగాళ్లను కట్టుదిట్టం చేయగలిగారు.

Story first published: Thursday, August 2, 2018, 13:39 [IST]
Other articles published on Aug 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X