న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిషేధం తర్వాత తిరిగి జట్టులో చేరిన దినేశ్‌ చండిమాల్‌

By Nageshwara Rao
Dinesh Chandimal returns to Sri Lanka T20I squad after ban

కొలంబో: ఐసీసీ విధించిన నిషేధం ముగియడంతో శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ దినేశ్‌ చండిమాల్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ20కి 15 మంది సభ్యులతో కూడిన జట్టుని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది.

మంగళవారం నుంచి కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. విండిస్‌తో జూన్‌లో జరిగిన టెస్టు సిరిస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో శ్రీలంక కెప్టెన్ చండిమాల్‌, కోచ్‌ చండికా హతురుసింఘె, మేనేజర్‌ అసంక గురుసిన్హపై ఐసీసీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

దీంతో చండిమాల్‌ రెండు టెస్టు సిరీస్‌లు, తొలి నాలుగు వన్డేలకు దూరమయ్యాడు. ఆదివారం జరగనున్న చివరి వన్డేకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో చండిమాల్‌‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండు గంటల పాటు శ్రీలంక జట్టు మైదానంలోకి వచ్చి ఫీల్డింగ్‌ చేసేందుకు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని ఐసీసీ నిషేధం విధించింది.

దక్షిణాఫ్రికాతో తలపడే లంక టీ20 జట్టు:
Angelo Mathews (captain), Dasun Shanaka, Kusal Perera, Dhananjaya de Silva, Upul Tharanga, Kusal Mendis, Thisara Perera, Shehan Jayasuriya, Shehan Madushanka, Lahiru Kumara, Dinesh Chandimal, Akila Dananjaya, Jeffrey Vandersay, Lakshan Sandakan, and Binura Fernando.

Story first published: Friday, August 10, 2018, 15:32 [IST]
Other articles published on Aug 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X