Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AUS Test Series: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు ఓటమి భయం పుట్టిస్తున్న శ్రీలంక.. భారీ ఆధిక్యం వైపు..!

 Dinesh Chandimal Heroic Century Helps to Srilanka In Commanding position over Australia

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 3వ రోజు శ్రీలంక కమాండింగ్ పొజిషన్లోకి వచ్చింది. దినేష్ చండిమాల్ (118పరుగులు 232బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) సెంచరీతో అదరగొట్టడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 6వికెట్ల నష్టానికి 431పరుగులు చేసింది. ఫలితంగా 67పరుగుల ఆధిక్యం సాధించింది. చండిమాల్ అద్భుత ప్రదర్శన వల్ల ఆస్ట్రేలియాకు ఓటమి భయం పట్టుకుంది. చండిమాల్‌కు అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న కమిందు మెండిస్ నుంచి మంచి సపోర్ట్ లభించడంతో వీరిద్దరు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి శ్రీలంకను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. ఇకపోతే 184పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంకను.. ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయాన్ ఆదిలోనే దెబ్బతీశాడు. కుశాల్ మెండిస్ (85 పరుగుల) వద్ద లయాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
ఇక క్రీజులో ఏంజెలో మాథ్యూస్‌ (52)తో కలిసి చండిమాల్‌ 83పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మళ్లీ జట్టును మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. వీరిద్దరి జోడిని మిచెల్ స్టార్క్ విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కమిందు మెనిడ్స్ చండిమాల్‌కు సరైన సహకారం అందించాడు. వీరిద్దరూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఆసీస్ బౌలింగ్‌పై ఆధిపత్యం చెలాయించారు. కమిందు మెండిస్ (61 పరుగులు) రాణించడంతో ఐదో వికెట్‌కు 133పరుగుల భాగస్వామ్యం లభించింది. చివరకు మిచెల్ స్వెప్సన్ బౌలింగ్‌లో మెండిస్ అవుటయ్యాడు.
చండిమాల్ రోజంత క్రీజులో నిలబడ్డాడు. ఈ క్రమంలో 195 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆసీస్‌పై అతనికి ఇది రెండవ సెంచరీ. అయితే నిరోషన్ డిక్వెల్లా (5) తొందరగానే ఔటయిపోవడంతో 6వ వికెట్‌ను శ్రీలంక కోల్పోయింది. కానీ చండిమాల్, రమేష్ మెండిస్ చివరి వరకు క్రీజులో నిలబడి స్కోరు 431పరుగులకు చేరుకుంది. తద్వారా ఆస్ట్రేలియాపై 67పరుగుల ఆధిక్యాన్ని శ్రీలంక సాధించింది. ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని శ్రీలంక చూస్తుండగా.. ఆస్ట్రేలియా శ్రీలంక గెలుపును అడ్డుకుని డ్రా చేసి సిరీస్ సమం చేయాలని ప్రయత్నిస్తోంది.
మ్యాచ్ సమ్మరీ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 364 (స్టీవ్ స్మిత్ 145నాటౌట్, లబుషేన్ 104, ప్రభాత్ జయసూర్య - 6వికెట్లు)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ - 431/6 (దినేష్ చండిమల్ 118నాటౌట్, కరుణరత్నే 86, కుశాల్ మెండిస్ 85, స్కార్క్, లయన్, స్వెప్సన్ తలా 2వికెట్లు)

Story first published: Sunday, July 10, 2022, 20:17 [IST]
Other articles published on Jul 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+