For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ టెస్టులో సెంచరీ చేసినా చండీమాల్‌కు దక్కని చోటు

Dinesh Chandimal axed for India vs Sri Lanka ODIs despite Test ton at Kotla

హైద‌రాబాద్‌: టెస్ట్ సిరీస్‌లో భాగంగా దిల్లీలో భార‌త్‌తో త‌ల‌ప‌డుతున్న శ్రీ‌లంక జ‌ట్టు సార‌థి ఛండీమాల్‌కు పెద్ద నిరాశే ఎదురైంది. నిర్ణయాత్మక చివరి టెస్టులో ఒంటరి పోరాటం చేసి ఫాలోఆన్‌ నుంచి బయటపడేసినా అత‌నికి గుర్తింపు లేకుండా పోయింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ 164 పరుగులు చేసి జట్టుకు బ‌లం చేకూర్చినా ఫ‌లితం క‌న్పించ‌లేదు.

ప్రస్తుతం శ్రీలంక టెస్టు జట్టుకు సారథిగా ఉన్న దినేశ్‌ చండీమాల్ బార‌త్‌తో జ‌ర‌గ‌నున్న వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కానీ సెలక్టర్లు అతనికి భారత్‌తో తలపడే వన్డే జట్టులో చోటు కల్పించలేదు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు మంగళవారం ఉదయం భారత్‌తో తలపడే వన్డే జట్టును ప్రకటించింది.

ఆల్‌రౌండర్‌ అసేలా గుణరత్నే, ఓపెనర్‌ ధనుష్క గుణతిలక తిరిగి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. జులైలో గాయం కారణంగా జట్టుకు దూరమైన గుణరత్నే తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలను పెరారీకు అందజేస్తున్నట్లు బోర్టు ప్రకటించింది. తరంగ నాయకత్వంలో లంక భారత్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. డిసెంబరు 10 నుంచి భారత్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

శ్రీలంక వన్డే జట్టు:

పెరీరా(కెప్టెన్‌), ఉపుల్‌ తరంగ, ధనుష్క, గుణతిలక, డిక్విలా, సమరవిక్రమ, తిరిమన్నె, మాథ్యూస్‌, గుణరత్నే, చతురంగ డిసిల్వా, సచిత్‌ పతిరానా, అకిల ధనంజయ, జెఫ్రీ వండర్సే, చమీర, సురంగ లక్మల్‌, నువాన్‌ ప్రదీప్‌.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 5, 2017, 17:54 [IST]
Other articles published on Dec 5, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+