Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG VS MI: శిక్ష విధించినా బుద్ధి మారలేదు.. లక్నో ప్లేయర్‌ బలుపు! (వీడియో వైరల్)

క్రమశిక్షణరాహిత్యం, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉలంఘించినందుకుగానూ గత మ్యాచులో భారీ ఫైన్, ఓ డిమెరిట్ పాయింట్.. అయినా కూడా అతడి తీరు మారలేదు. మళ్లీ ప్రత్యర్థితో అదే ప్రవర్తన తీరు ప్రవర్తించి మరోసారి విమర్శలకు గురయ్యాడు. అతడే దిగ్వేశ్ రథి. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచులోనూ అతడు తన అద్భుత ప్రదర్శనతో పాటు కాంట్రవర్సీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని హాట్ టాపిక్‌గా మారాడు.

ఈ మ్యాచు విజయంలో స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠీ కూడా కీలకంగా వ్యవహరించాడు. అతడు నమోదు చేసిన 1/21 మ్యాచ్ ఫలితంపై గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే దిగ్వేశ్ రథి.. రెండో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లోనే నోట్ బుక్ సంబరాలు చేసుకున్నాడు. మొదటగా ఛేధనలో వికెట్లు పడి ముంబయి ఒత్తిడిలోకి వెళ్లిపోయిన సందర్భంలో నమన్ ధీర్ చెలరేగి ఆడాడు. ఆకాశ్ దీప్ వేసన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుసగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదేశాడు. దీంతో పవర్ ప్లేలో చివరికి ముంబయి 64/2తో కాస్త కోలుకుంది. అయితే ఈ క్రమంలోనే దూకుడు మీదున్న నమన్ ను దిగ్వేశ్ ఔట్ చేసి గట్టిగా దెబ్బ కొట్టాడు. ద్విగేశ్ వేసిన ఓవర్‌లోని మొదటి బంతిని లెగ్ సైడ్‌కి ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు ధీర్. కానీ అది కాస్త బోల్తా కొట్టి ఔట్ అయ్యాడు. దీంతో దిగ్వేశ్.. మొదట శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా తరహాలో చిన్నగా డ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ వెంటనే ధీర్ వైపు చూస్తూ తన నోట్‌బుక్ సంజ్ఞను చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది.

Digvesh Rathi Repeats His Notebook Celebration in LSG Vs MI IPL 2025

గత మ్యాచులోనూ పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేసిన దిగ్వేశ్.. అతడి దగ్గరికి పరుగెత్తుకు వెళ్లి మరీ సైన్ అండ్ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో అతడికి ఓ డీమెరిట్ పాయింట్ ఇవ్వడంతో పాటు మ్యాచు ఫీజులో 25 శాతం కోత విధించారు నిర్వాహకులు. చూడాలి మరి ముంబయి మ్యాచులోనూ ఇదే తీరు కనబరిచిన దిగ్వేశ్ కు మరి ఎలాంటి శిక్ష విధిస్తారో.

Story first published: Saturday, April 5, 2025, 9:08 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+