ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో జరిమానా ఎదుర్కొన్న లక్నో ఆటగాడు దిగ్వేశ్ రాఠి. వికెట్ తీయగానే అతడు నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకోవడం పెద్ద వివాదంగా మారింది. అయితే తాజాగా దిగ్వేశ్.. తన వివాదస్పద నోట్ బుక్ సెలబ్రేషన్స్ పై స్పందించాడు. అలా సంబరాలు చేసుకోవడాన్ని సమర్థించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కేకేఆర్ షేర్ చేసింది.
వీడియోలో దిగ్వేశ్ రాఠిని.. సునీల్ నరైన్‌కు పరిచయం చేశాడు నికోలస్ పూరన్. ఆ వెంటనే పూరన్ మాట్లాడుతూ.. 'నరైన్ సంబరాలు చేసుకోడు కదా, నువ్వెందుకు చేసుకుంటున్నావు?' అని అడిగాడు. దానికి దిగ్వేశ్ తనదైన శైలిలో స్పందించాడు. 'నేను దిల్లీ నుంచి వచ్చా' అని సమాధానం ఇచ్చాడు. అంటే విరాట్ కోహ్లీ కూడా దిల్లీకి చెందిన ఆటగాడే. పైగా అతడు కూడా మైదానాల్లో ప్రత్యర్థులను కవ్విస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. గతంలో విండీస్‌పై కూడా కోహ్లీ అలా నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీని బట్టి తాను కూడా కోహ్లీ బాటలోనే నడుస్తున్నట్లు పరోక్షంగా సమాధానం చెప్పాడు.

పంత్ సెటైర్..
దిగ్వేశ్ సమాధానానికి.. లక్నో కెప్టెన్ పంత్ స్పందించాడు. పంత్ మాట్లాడుతూ.. "రాఠి టికెట్ కలెక్టర్. నరైన్ వికెట్ కలెక్టర్. అందుకే దిగ్వేశ్ చెక్కులు రాస్తున్నాడు." అని సరదాగా అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
తొలి మ్యాచులో 25.. రెండో మ్యాచులో 50..
దిగ్వేశ్ కు మొదటి మ్యాచులో రూ.12 లక్షలు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. రెండో మ్యాచులో మ్యాచు ఫీజులో 50 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు.