ఫైనల్ ఓవర్ సూపర్ హీరోలు..!!
లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. గురువారం రాత్రి లక్నోలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆధిపత్యం చాటింది. ఈ ఉత్కంఠ పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా, అనంతరం బెంగళూరు అదే 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఇది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో వర్షం పదే పదే అంతరాయం కలిగించినప్పటికీ రెండు జట్లు కూడా ఏ మాత్రం ఏకాగ్రతను కోల్పోలేదు. 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) సెంచరీతో చెలరేగగా.. నికోలస్ పూరన్ (23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), రిషభ్ పంత్ (10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) దూకుడుగా ఆడారు.

ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్ తలో వికెట్ తీశారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆర్‌సీబీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. ఆర్‌సీబీ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులే చేసి ఓటమిపాలైంది. రజత్ పటిదార్ (31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61), దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), టీమ్ డేవిడ్ (17 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) రాణించినా.. 213 పరుగులను అందుకోలేకపోయింది.
కృనాల్ పాండ్యా, రొమారియో షెపెర్డ్(23) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(3/33) మూడు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఒక వికెట్ దక్కింది. చివరి ఓవర్ లో 20 పరుగులు డిఫెండ్ చేయాల్సిన బాధ్యత దిగ్వేష్ రాఠీపై పడింది. అప్పటికే మూడు ఓవర్లలో 41 పరుగులిచ్చినా, అతన్నే నమ్ముకుని బంతిని అప్పగించాడు కేప్టెన్ రిషభ్ పంత్. కొన్ని సూచనలు సైతం ఇచ్చాడు. అది సత్ఫలితాలను ఇచ్చింది.
ఒత్తిడిని తట్టుకుని దిగ్వేష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్‌కు 20 పరుగులు అవసరం కాగా.. హిట్టర్లు రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉండటం ఆర్సీబీలో ఆశలు రేకెత్తించింది. అయినప్పటికీ వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టదిట్టంగా బంతులు వేశాడు దిగ్వేష్ రాఠీ. రొమారియో చివరి ఓవర్‌లో బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో లక్నో 9 పరుగులతో విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications