వెస్టిండిస్ క్రికెట్‌పై క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు సార్లు వరల్డ్ టీ20 ఛాంపియన్స్‌గా నిలిచిన వెస్టిండిస్ జట్టు రాబోయే రోజుల్లో టెస్టు క్రికెట్‌లో పూర్వ వైభవం తెచ్చుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.
సమీప భవిష్యత్తులో కూడా వెస్టిండిస్ జట్టు టెస్టుల్లో రాణించే అవకాశాలు తనకు కనిపించడం లేదని తెలిపాడు. డియాగో కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన క్రిస్ గేల్ పీటీఐతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రస్తుత క్రికెట్ విధానంతో టెస్టుల్లో కరీబియన్లు ఓటముల నుంచి కోలుకుని రాణించడం సాధ్యం కాదన్నాడు.
టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే ఏకాగ్రత, నిరంతర కృషి ఉండాలని చెప్పాడు. అదే టీ20 క్రికెట్‌కు వస్తే తక్కువ సమయంలో మ్యాచ్ ముగుస్తుంది కనుక కొద్దిసేపు రాణిస్తే సరిపోతుందని అన్నాడు. ప్రస్తుత యువతరం కూడా టెస్టు క్రికెట్ కంటే టీ20 క్రికెట్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపాడు.

ప్రైవేట్ టీ20 లీగ్‌లపైనే దృష్టి
టీ20ల్లో వెస్టిండిస్ రాణించడానికి ఇది కూడా ఒక కారణమని గేల్ అభిప్రాయపడ్డాడు. రాబోయే తరం ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ పైనే దృష్టి పెడతారని, సుదీర్ఘ ఆటపై ఆసక్తిని పెద్దగా కనబర్చరని గేల్ పేర్కొన్నాడు. వెస్టిండిస్ జట్టులోకి యువ ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ టీ20 లీగ్‌లపైనే దృష్టి సారిస్తున్న విషయాన్ని సైతం గేల్ గుర్తు చేశాడు.

టీ20లు అభిమానులకు చక్కటి వినోదాన్ని
మీరు ప్రొపెషనల్ క్రికెటర్ అవ్వాలంటే మంచి క్రికెటర్ కావాలని గేల్ అభిప్రాయపడ్డాడు. ఇక టెస్టులతో పోలిస్తే టీ20లు అభిమానులకు చక్కటి వినోదాన్ని కలిగిస్తున్నాయని, టీవీ కవరేజి కూడా బాగుందని అన్నాడు. వెస్టిండిస్ క్రికెట్ అభ్యున్నతికి అందరి బాధ్యతగా బోర్డుతో పాటు ఆటగాళ్లు సైతం చేతులు కలపాల్సి ఉంటుందని గేల్ అభిప్రాయపడ్డాడు.

2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతా
తనకు అవకాశమిస్తే తాను 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడతానని, బహుశా అప్పటివరకే తన వన్డే కెరీర్ ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతానిరి ఫిట్‌నెస్‌తో పాటు చక్కటి ఫామ్‌లో ఉన్నానని చెప్పాడు. గతంలో కేవలం ఫాస్ట్ బౌలర్లు మాత్రమే జట్టుకు విజయాలు అందించేవారని ఇప్పుడు రెండు విభాగాలలో అలాంటి పరిస్థితి లేదన్నాడు.

ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నా
ఇటీవల తమ జట్టు స్వదేశంలో భారత్ చేతిలో, విదేశాలలో పాకిస్తాన్ చేతిలో సిరీస్‌లు కోల్పోయిన విషయాన్ని సైతం క్రిస్ గేల్ గుర్తుచేశాడు. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నందున బిగ్ బాష్‌లో ఆడటం లేదని, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్‌లలో రాణించడంపైనే దృష్టి సారించినట్లు గేల్ వివరించాడు. ఇక గేల్ 103 టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించి మొత్తం 7214 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications