Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యా బ్ర‌ద‌ర్స్.. టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడుతారా?!! (వీడియో)

different sport: Krunal Pandya, Hardik Pandya Play Table Tennis On Bed

ముంబై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రికెట్ పోటీలు నిలిచిపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇళ్లలోనే ఉంటూ.. కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్‌కే ప‌రిమితమైన ఆట‌గాళ్లు న‌చ్చిన‌ ప‌ని చేస్తూ గ‌డిపేస్తున్నారు. అందరూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. అయితే ప్లేయర్లు అప్పుడప్పుడూ వినూత్న రీతిలో ఆటలు కూడా ఆడుకుంటున్నారు. మైదానంలో ఎప్పుడూ జోష్​ మీద ఉండే టీంఇండియా ​ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇంట్లో కొత్త పద్ధతిలో టేబుల్ టెన్నిస్ ఆడారు.

విభిన్నంగా టేబుల్ టెన్నిస్:

పాండ్యా బ్ర‌ద‌ర్స్ త‌మ‌ బెడ్‌రూంలో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న వీడియోను కృనాల్ గురువారం పోస్ట్ చేశాడు. బెడ్‌కు ఇరువైపులా హార్ధిక్, కృనాల్ పాండ్యాలు నిల‌బ‌డి టేబుల్ టెన్నిస్ ఆడారు. మధ్యలో బెడ్‌షీట్ (దుప్పటి)ను నెట్ లాగ ఉపయోగించారు. ముంబై ఇండియన్స్​ ఆటగాళ్లైన పాండ్యా బ్రదర్స్​.. ఇద్దరూ బెడ్​కు చెరో వైపు నిలబడి టెన్నిస్ బాల్​తో చేతుల సాయంతో టేబుల్ ​టెన్నిస్ ఆడారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

ఇలా కూడా ఆడ‌తారా?:

ఇలా కూడా ఆడ‌తారా?:

కృనాల్ పాండ్యా వీడియోనూ షేర్ చేస్తూ...'మేము ఈరోజు స‌రికొత్త టేబుల్ టెన్నిస్ ఆడాం. బెడ్‌షీట్‌ను నెట్‌గా మార్చుకొని చేతుల‌నే బ్యాట్‌గా భావించి ఆడాం. మీకు తెలుసుగా.. నా త‌మ్ముడు ఉంటే ఇలాంటి చిలిపి ఆలోచ‌న‌లే వ‌స్తాయి. ఇది కూడా వాడి ప్లానే.. అయితే గేమ్‌ను మాత్రం కాంపిటేటివ్‌గానే ఆడాం. ఈ రౌండ్‌లో ఎవ‌రు గెలుస్తారో మీరో చెప్పండి అంటూ' క్యాప్ష‌న్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియో కూడా నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడ‌తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

త్రోబ్యాక్ పిక్:

త్రోబ్యాక్ పిక్:

తాజాగా హార్దిక్‌ పాండ్యా ఓ త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేసాడు. 2011లో తన సోదరుడు కృనాల్‌ పాండ్యాతో కలిసి దిగిన ఒక ఫోటోను హార్దిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో కృనాల్‌ వైట్‌ టీషర్ట్‌లో ఉండగా.. హార్దిక్‌ మాత్రం బ్లాక్‌ టీషర్ట్‌, మెడలో చైన్, కళ్లకు గాగుల్స్‌తో పెట్టుకుని కొత్తగా కనిపించాడు. ఈ ఫోటోకు 'త్రో బ్యాక్‌ టు 2011.. స్వాగ్‌ మేరా దేశ్‌ హై విత్‌ కృనాల్‌ పాండ్యా' అనే క్యాప్షన్‌ హార్దిక్‌ జత చేశాడు.

పునరాగమనం కోసం హార్దిక్‌ వెయిటింగ్:

పునరాగమనం కోసం హార్దిక్‌ వెయిటింగ్:

గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్‌ పాండ్యా ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. కివీస్ పర్యటనకు ఎంపికవుతాడనుకున్నా.. పూర్తి ఫిట్‌నెస్‌ లేకపోవడంతో తప్పుకున్నాడు. అయితే దేశవాళీ టోర్నీలో సత్తాచాటాడు. స్టేడియాన్ని సిక్సులతో హోరెత్తించాడు. ఆపై దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక కరోనా కారణంగా ఐపీఎల్-13 కూడా వాయిదా పడడంతో పునరాగమనం కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

Story first published: Thursday, April 23, 2020, 21:46 [IST]
Other articles published on Apr 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+