నన్ను నేనే అద్దంలో చూసుకుంటే భయపడొద్దు: ద్రావిడ్
కోల్‌కతా: అద్దంలో తనను తాను చూసుకుంటే భయపడేంత విచిత్రమైన హెయిల్ స్టయిల్‌ను తాను ఎప్పుడు చేయించుకోలేదని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. చిత్రవిచిత్రమైన ఫంకీ హెయిర్ స్టయిల్స్ మీరు చేయించుకోవడం చూడలేదు.. ఎందుకు? అని ఓ అభిమాని ప్రశ్నించాడు.
దానికి రాహుల్ ద్రావిడ్ వీడియో సందేశాన్ని అప్ లోడ్ చేశాడు. తల పైన రకరకాల గుర్తులు ఉంటే ఉదయం నిద్ర లేచి నా ముఖాన్ని అద్దంలో చుసుకుంటే భయపడిపోతానని సరదాగా వ్యాఖ్యానించాడు. శిఖర్ ధావన్ మెలి తిరిగిన మీసాలు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. తనకూ అలా ఉంటే తప్పకుండా పెంచేవాడినన్నాడు.

అయితే, హెయిర్ స్టయిల్స్‌ను వివిధ రకాలుగా కట్ చేయించుకోవడం తనకు ఆసక్తి లేదని చెప్పాడు. తనకు సాధారణ హెయిర్ స్టయిల్ అంటేనే ఇష్టమని చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ కొద్ది రోజుల క్రితం పటౌడీ స్మారక ఉపన్యాసం అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications