'యుక్త వయసులో ఉన్నప్పుడు భారత్‌కు ఆడే విలువ తెలియలా'
హైదరాబాద్: శనివారం నుంచి ఆసీస్‌తో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. యోయో ఫిట్‌నెస్ టెస్టులో కోహ్లీతో పాటు సమానంగా పాయింట్లు సాధించడంతో సెలక్టర్లు ఆశిష్ నెహ్రాని ఎంపిక చేశారు.
దీంతో తొలి టీ20కి ఆతిథ్యమివ్వనున్న రాంచీకి చేరుకున్న నెహ్రా శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. భారత్ తరఫున మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే కెరీర్‌లో చాలా సార్లు గాయాలబారిన పడ్డానని.. అయితే మళ్లీ ఫిటెనెస్ కోసం తాను పట్టుదలతో శ్రమించినట్లు పేర్కొన్నాడు.

మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నా
'నేను మరో రెండేళ్లు క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నా. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే 38-39 ఏళ్ల బౌలర్ శరీరం వేగంగా బంతులు విసిరేందుకు అంతగా సహకరించకపోవచ్చు. అయితే నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నిస్తా. పట్టుదలతో ఫిటెనెస్ సాధించి మళ్లీ జట్టులో చోటు సంపాదించా' అని నెహ్రా తెలిపాడు.

అన్నివిధాలుగా ఫిట్‌గా ఉన్నా
తాను అన్నివిధాలుగా ఫిట్‌గా ఉండటంతో ఆడటానికి ఎటువంటి అభ్యంతరం లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో తన శరీరం సహకరించే వరకూ క్రికెట్ ఆడతానని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. 'ఫిట్‌నెస్ పరంగా ఇబ్బంది లేదు. నాకు నా శరీరం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దాంతో మరికొన్ని సంవత్సరాలు ఆడతానని ఆశిస్తున్నా' అని అన్నాడు.

అప్పుడు భారత జట్టుకు ఆడే విలువ తెలియలా
'యుక్త వయసులో ఉన్నప్పుడు దేనిని పెద్దగా అర్ధం చేసుకోం. అప్పుడు భారత జట్టుకు ఆడే విలువ తెలియదు. గత 7-8ఏళ్లలో నేను చాలా క్రికెట్ మిస్సయ్యాను. కానీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే యత్నం చేయలేదు. ఫలితాల్ని సాధించడం కోసం కృషి చేస్తూనే ఉన్నా. అందుకే మళ్లీ జట్టులోకి వచ్చా' అని నెహ్రా తెలిపాడు.

ఎటువంటి ప్రణాళికలు లేవు
ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ప్రణాళికలు లేవని నెహ్రా పేర్కొన్నాడు. ప్రతీ సిరీస్‌ను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చాడు. వచ్చే ఐపీఎల్లో తాను ఆడటంపై హామీ ఇవ్వలేనని అన్నాడు. అలాగే తన కెరీర్ ఎప్పుడు వరకూ సాగుతుందో కచ్చితంగా చెప్పలేనన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ ఆడిన నెహ్రా, అనంతరం గాయం కారణంగా గత ఎనిమిది నెలలుగా టీమిండియాకు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications