Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అసలు పదవి నుంచి తప్పుకోవడానికి కారణం అది కాదు'

Richard Halsall

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో ఈ మధ్య పదవుల రాజీనామాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు బ్యాల్ ట్యాంపరింగ్ వివాదం అనంతరం జట్టు ప్రధాన కోచ్ డారెన్ లీమన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఇలానే బంగ్లాదేశ్ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ పదవి నుంచి రిచర్డ్ హల్ సాల్ తప్పుకున్నాడు. అయితే తాను పదవి నుంచి తప్పుకోవడానికి సీనియర్‌ క్రికెటర్లతో విభేదాలు ఎంతమాత్రం కారణం కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు రిచర్డ్‌ హల్‌సాల్‌ తాజాగా స్పష్టం చేశాడు.

బంగ్లాదేశ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ పదవికి గత నెల్లో రిచర్డ్‌ హల్‌సాల్‌ గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఘోర వైఫల్యం అనంతరం రిచర్డ్‌ హల్‌సాల్‌ ఉన్నపళంగా పదవి నుంచి తప్పుకున్నాడు. సరిగ్గా ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ పదవి నుంచి గౌతం గంభీర్ తప్పుకుంటున్నట్లుగానే తప్పుకున్నాడట.

అయితే బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెటర్లతో విభేదాలతోనే జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ పదవికి హల్‌సాల్‌ వీడ్కోలు చెప్పినట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై సోమవారం బీసీబీ కార్యాలయానికి హాజరైన హల్‌సాల్‌ మాట్లాడుతూ వివరణ ఇచ్చాడు.

'నాకు సీనియర్‌ క్రికెటర్లతో సఖ్యత లేదని వార్తల్లో నిజం లేదు. సీనియర్‌ ఆటగాళ్ల అభిప్రాయం అనేది జట్టుకు ఎప్పుడూ అవసరమే. వారి నుంచి చాలా సందర్భాల్లో సలహాలు స్వీకరించా. వారితో ఎప్పుడూ నాకు అభిప్రాయ భేదాలు రాలేదు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే అసిస్టెంట్‌ కోచ్‌ పదవి నుంచి వైదొలిగా' అని రిచర్డ్‌ హల్‌సాల్‌ వివరణ ఇచ్చాడు.

Story first published: Monday, April 30, 2018, 19:20 [IST]
Other articles published on Apr 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+