'పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వద్దకు ద్రవిడ్ ఎందుకెళ్లాడు'
హైదరాబాద్: పాకిస్తాన్ అండర్ 19 జట్టు ఆటగాళ్లు ఓడిపోవడం ఏదో మాయ చేసినట్లు ఉందని పాక్ జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత అండర్ 19 జట్టు విజేతలుగా స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలు పాక్ మేనేజర్ వ్యాఖ్యలకు బలం చేకూర్చాయి. అయితే ఆ విషయాన్ని ద్రవిడ్ సాగదీయకుండా సుస్పష్టమైన సమాదానం ఇవ్వడంతో సందేహం లేకుండా పోయింది.
తేటతెల్లమైన సందేహం:
న్యూజిలాండ్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సోమవారం ముంబైకి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్రవిడ్, భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో పాక్ ఆటగాళ్ల డ్రస్సింగ్ రూమ్‌కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్-19 భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కొట్టి పారేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ ద్రవిడ్, జట్టు సారథి పృథ్వీ షా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

పాక్ మేనేజర్‌తో మాట్లాడారా:
ఈ నేపథ్యంలో ఓ విలేకరి టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో సెమీఫైనల్ అనంతరం మీరు ఆ జట్టు డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్ మేనేజర్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్లారు? అని అడిగాడు.
అభినందించడంలో తప్పేంటి?:
‘నేను పాక్ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు. ఆ జట్టులో ఒక ఎడమచేతి వాటం బౌలర్ టోర్నీలో బాగా రాణించాడు. అతన్ని అభినందించడానికి డ్రస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లాను. కానీ, రూమ్‌లోకి వెళ్లలేదు' అని ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు.

పరుగులు చేయకపోయినా:
టోర్నీలో భాగంగా భారత్-పాక్ మధ్య రెండో సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయలేకపోయినప్పటికీ బౌలర్లు బాగానే శ్రమించారు.

నాలుగు సార్లు వరల్డ్ కప్:
ఫైనల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన పృథ్వీ షా సేన ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నాలుగుసార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications