తొలిసారి ఎంపిక చేయలేదు, ఆ కసితో క్రికెట్‌పై అంకితభావం పెరిగింది: సచిన్

హైదరాబాద్: తొలిసారి సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు తనను ఎంపిక చేయలేదని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. దీంతో ఆటలో మరింత మెరుగయ్యేందుకు కఠోరంగా శ్రమించి... అనుకున్నది సాధించానని తెలిపారు. శుక్రవారం సచిన్ టెండూల్కర్ పశ్చిమ మహారాష్ట్రలోని దివంగత లక్ష్మణ్‌రావ్ దురె పాఠశాలలో మాట్లాడారు.

సచిన్ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు
సచిన్ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు అతను ఈ స్కూల్‌కు మంజూరు చేసిన నిధులతో మూడు తరగతి గదులను నిర్మించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలాగైనా భారత జట్టుకు ఆడాలని పరితపించేవాడిని. 11 ఏళ్ల వయస్సులో నా క్రికెట్ ప్రయాణం ప్రారంభమైంది" అని అన్నారు.
తొలిసారి సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు
"అయితే, నేను తొలిసారి సెలక్షన్ ట్రయల్స్‌కు వెళ్లినప్పుడు సెలక్టర్లు నన్ను ఎంపిక చేయలేదు. నా ఆటను మెరుగు పరుచుకొనేందుకు మరింత కష్టపడాలని వారు సూచించారు. నేను మెరుగ్గానే బ్యాటింగ్ చేసినప్పటికీ ఎంపిక కానందుకు చాలా నిరాశపడ్డా. ఆ కసితో క్రికెట్‌పై అంకితభావం మరింతగా పెరిగింది. మీరు కలలను నిజం చేసుకోవాలంటే అందుకు ఎలాంటి సులభ మార్గాలుండవ్" అని సచిన్ పేర్కొన్నారు.

సోదరి తొలిసారిగా క్రికెట్ బ్యాట్ కొనిచ్చింది
తాను పెద్ద క్రికెటర్ అయ్యేందుకు కుటుంబ సభ్యులు, గురువు రమాకాంత్ అచ్రేకర్ అండగా నిలిచారని సచిన్ అన్నారు. తన సోదరి తొలిసారిగా క్రికెట్ బ్యాట్ కొనిచ్చిందని గుర్తు చేసుకున్నాడు. "క్రికెట్లో నా విజయానికి నా కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులు, సోదరులు అజిత్, నితిన్ ఎంతో మద్దతు ఇచ్చారు" అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

అచ్రేకర్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే
"పెళ్లి తర్వాత పుణెలో ఉంటున్న నా అక్క అప్పుడు నన్నెంతో ప్రోత్సహించింది. నిజానికి నాకు మొదట బ్యాటు కొనిచ్చిందే ఆమే. పెళ్లి తర్వాత అంజలి, ఆమె తల్లిదండ్రులు, నా పిల్లలు సారా, అర్జున్ అండగా ఉన్నారు. ఇక గురువు రమాకాంత్ అచ్రేకర్ సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే" అని సచిన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications