తెలిసింది: కోహ్లీ థైప్యాడ్స్ ఉన్న సంతకం అనుష్కది కాదు
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే సమయంలో థైప్యాడ్స్ ధరిస్తున్న సంగతి తెలిసిందే. తెల్ల రంగులో ఉండే ఆ ప్యాడ్స్‌పై ఆటగాళ్లు తాము అభిమానించే వారిదో లేదంటే ప్రేమించే వారిదో ఆటోగ్రాఫ్ తీసుకుంటుంటారు.
ఆ తర్వాత వాటిని కట్టుకుని నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తారు. మోడ్రన్ డే క్రికెట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. తన ఆటతీరుతోనే కాదు ఫ్యాషన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులుగా సంపాదించుకున్నాడు.

అలాంటి కోహ్లీ విషయంలో ప్రతిదీ ప్రత్యకమే. కోహ్లీ కట్టుకొనే ప్యాడ్లపై ఇలాగే ఓ ఆటోగ్రాఫ్ కనిపించడంతో అది తన ప్రేయసి అనుష్కశర్మదే అంతా అనుకున్నారు. అయితే ఆ సంతకం అనుష్కది కాదని ఇప్పుడ తేలిపోయింది.
ఆ సంతకం స్టీవ్ రింఫ్రీది. ఆటగాళ్లకు అవసరమైన గార్డులు, ప్యాడ్ల వంటి రక్షణ సామగ్రిని ఈ సంస్ధ తయారు చేస్తుంది. 1987లో ప్రారంభమైన ఈ కంపెనీయే అలన్ బోర్డర్, గ్రాహమ్ గూచ్, సునీల్ గావస్కర్, షేన్ వార్న్ వంటి దిగ్గజాలకు గార్డులు సరఫరా చేసింది.
ఇందులో భాగంగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రింఫ్రీ సంస్థకు సంబంధించిన గార్డులనే వినియోగిస్తున్నాడు. కోహ్లీనే కాదు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ సంస్ధకు సంబంధించిన గార్డులనే వినియోగించడం విశేషం. వీరిద్దరే కాదు చాలా మంది క్రికెటర్లు వీటినే వాడతారు. దీంతో ఇప్పుడు ఈ సంతకం ఎవరిదో తెలిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications