Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ‌పై కోపంతో డీఎస్పీ సిరాజ్ ఏం చేశాడంటే.. ఆన్ డ్యూటీ! (Video)

ఐపీఎల్ మెగా వేలం‌లో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టారు. అయితే 2018 నుంచి 2024 సీజన్ వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన మహ్మద్ సిరాజ్‌ను వేలంలో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఈ హైదరాబాద్ పేసర్ కోసం గుజరాత్ రూ.12.25 కోట్లు వెచ్చించింది.

సిరాజ్‌ కోసం ఆర్సీబీ ఆర్‌టీఎమ్ కూడా ఉపయోగించలేదు. రిటైన్ లిస్ట్‌లో సిరాజ్ లేకపోవడంతో ఆర్థిక పరమైన వ్యూహాలతో వేలంలో ఆర్‌టీఎమ్‌తో దక్కించుకుంటారని భావించారంతా. కానీ మెగా ఆక్షన్‌లో సిరాజ్‌ను దక్కించుకోవాలని ప్రయత్నమే బెంగళూరు ఫ్రాంచైజీ చేయలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ పెర్త్ టెస్టులో ఇవాళ ఆవేశంతో బంతులు సంధిస్తున్నాడు.

Did RCB s Snub Ignite Siraj s Fury Internet Can t Stop Laughing at His Fiery Spells Against Australia


టీమిండియా ప్రైమ్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కంటే ఈ హైదరాబాదీ పేసరే నిప్పులు చెలరేగుతున్నాడు. తన తొలి ఓవర్ మూడో బంతికే ఉస్మాన్ ఖవాజా (4; 13 బంతుల్లో) బోల్తాకొట్టించాడు. టెస్టుల్లో ఖవాజాను సిరాజ్ ఔట్ చేయడం ఇది మూడో సారి. ఆసీస్ ఓపెనర్‌ ఖవాజాకు 81 బంతులు సంధించిన సిరాజ్ 31 పరుగులిచ్చి మూడు సార్లు పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత డేంజర్ బ్యాటర్‌ స్టీవ్ స్మిత్ (17; 60 బంతుల్లో)ను సిరాజ్ ఔట్ చేశాడు.

స్టన్నింగ్ డెలివరీతో కుదురుకున్న స్మిత్‌ను సిరాజ్ బోల్తాకొట్టించాడు. దీంతో ట్రావిస్ హెడ్ (89)- స్మిత్ 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే సిరాజ్‌ను ఆర్సీబీ తిరిగి దక్కించుకోకపోవడంతో నెట్టింట్లో ఫన్నీ పోస్టులు కనిపిస్తున్నాయి. ఆర్సీబీ మీద కోపాన్ని ఆస్ట్రేలియాపై చూపిస్తున్నాడని, డీఎస్పీ సిరాజ్ బెంగళూరు నుంచి లక్నోకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడని.. ఆన్ డ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లి- మహ్మద్ సిరాజ్ ఒకే జట్టులో లేకపోవడం బాధాకరమని మరికొంతమంది పేర్కొంటున్నారు.

Story first published: Monday, November 25, 2024, 11:35 [IST]
Other articles published on Nov 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+