Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనన్య బిర్లాకు ఘోర అవమానం? ట్రోఫీ గెలిస్తే ఇంతా బలుపా! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఆర్సీబీ ఘనవిజయం సాధించి.. వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరు ముగిసిన అనంతరం దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. స్టేడియంలో ప్లేయర్లు కూడా ఒకరినొకరు కౌగిలించుకుంటూ.. ఎగిరి గంతేస్తూ గెలుపు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఆనంద క్షణాల్లో ఆర్సీబీ క్యాంపులో ఓ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. కోట్లు పెట్టి జట్టును కొనుగోలు చేసిన ఆర్సీబీ యజమాని అనన్య బిర్లాకు స్టేడియంలో ఘోర అవమానం జరిగిందంటూ ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాప్తిస్తోంది.

యజమానిని గాలికొదిలేసిన కెప్టెన్ రజత్ పాటిదార్?
మ్యాచ్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి దూసుకొచ్చి విజయోత్సవంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే జట్టుకు అండగా నిలిచిన ఆర్సీబీ యజమాని అనన్య బిర్లా కూడా ప్లేయర్లను అభినందించడానికి మైదానంలోకి వచ్చారు. అయితే అక్కడ ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఆర్సీబీని ముందుండి నడిపించి టైటిల్ గెలిపించిన కెప్టెన్ రజత్ పాటిదార్.. అనన్య బిర్లా పక్కనే ఉన్నప్పటికీ ఆమె వైపు చూడలేదని తెలుస్తోంది. రజత్ పాటిదార్ తన జట్టు సభ్యులను, కోచ్‌లను, అలాగే తన కుటుంబ సభ్యులను హగ్ చేసుకుంటూ బిజీగా గడిపాడు తప్ప, పక్కనే నిలబడిన ఓనర్‌కు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా పక్కకు వెళ్ళిపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి.

Did Rajat Patidar Ignore RCB Owner Ananya Birla IPL 2026 Final Video Viral Full Details

నెటిజన్ల ఆగ్రహం.. ఆర్సీబీ ప్లేయర్లకు తలపొగరు అంటూ కామెంట్స్
కెప్టెన్ రజత్ పాటిదార్ తన వద్దకు వచ్చి విజయాన్ని పంచుకుంటాడని అనన్య బిర్లా ఎంతో ఆశగా ఎదురుచూసినట్లు ఆ వైరల్ వీడియోను బట్టి అర్థమవుతోంది. కానీ రజత్ పటీదార్ ఆమెను పూర్తిగా విస్మరించి తన దారిన తాను వెళ్ళిపోవడంతో, ఆమె అక్కడ కాసేపు తీవ్ర అసహనానికి, ఇబ్బందికి గురైనట్లు స్పష్టమవుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. "కోట్లు పెట్టి ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన యజమానికే కనీస గౌరవం ఇవ్వరా?" అంటూ నెటిజన్లు ఆర్సీబీ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ట్రోఫీ గెలిచామనే గర్వంతోనే రజత్ పటీదార్ అంత బలుపు, తలపొగరు చూపించాడంటూ నెట్టింట దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ వివాదం పక్కన పెడితే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ అంతగా రక్తికట్టలేదు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆర్సీబీ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయం చాలా సులభంగా మారింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ 42 బంతుల్లోనే 75 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. చివరిలో కోహ్లీ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేయడంతో ఆర్‌సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి లీగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

Story first published: Monday, June 1, 2026, 13:49 [IST]
Other articles published on Jun 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+