Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాట్రిక్ అని అప్పుడు తెలియదు: పెరెరా

రాంచీ‌: భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో హ్యాట్రిక్ సాధించినప్పుడు ఆ సమయంలో తనకు తెలియలేదని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ తిషారా పెరెరా చెప్పాడు. భారత్‌ 19వ ఇన్నింగ్సులో అతను వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు.

తాను వికెట్లు తీయడంపై, పరుగులు కట్టడి చేయడంపై దృష్టి పెట్టాననని, దాంతో హ్యాట్రిక్ విషయాన్ని పట్టించుకోలేదని చెప్పాడు. 19వ ఓవరు నాలుగో బంతికి పాండ్యాను, ఆ తర్వాత ఐదో బంతికి సురేష్ రైనాను, ఆరో బంతికి యువరాజ్ సింగ్‌ను అవుట్ చేశాడు.

Did not know about my hat-trick, says Thisara Perera

మొత్తంగా తనకు ఇది రెండో హ్యాట్రిక్ అని, గతంలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచులో తొలిసారి ఈ ఫీట్ సాధించాని చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని తమ జట్టు ముందే నిర్ణయం తీసుకుందని పెరెరా చెప్పాడు. టీమిండియా బ్యాటింగ్ కారణంగానే తమ జట్టు ఓటమి పాలైందని ఆయన అన్నాడు.

శిఖర్ ధావన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అశ్విన్ తన బౌలింగుతో తమ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడని ఆయన చెప్పాడు. టీ20 మ్యాచుల్లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ఆటగాడిగా పెరెరా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు బ్రెట్‌లీ, జాకబ్ ఓరమ్, టీమ్ సౌతీలు హ్యాట్రిక్‌లు సాధించారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+