విజయ్ ప్రమాణ స్వీకారంలో భద్రతాధికారిగా సీఎస్కే స్టార్ బౌలర్?
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం సీఎస్కే, లక్నో జట్ల మధ్య కీలక మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో వైరల్‌గా మారింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదికపై ఉన్న ఓ భద్రతా అధికారి అచ్చం సీఎస్కే ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌లా కనిపించారు. దీంతో నెటిజన్లు ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి "అన్షుల్ కాంబోజ్ పార్ట్ టైమ్ పోలీస్ డ్యూటీలో ఉన్నాడా?" అంటూ మీమ్స్‌తో హోరెత్తించారు.
రవిచంద్రన్ అశ్విన్ ఫన్నీ ట్వీట్.. నెటిజన్ల కామెంట్స్
ఈ వైరల్ ఫోటోపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అశ్విన్ స్పందిస్తూ.. "డ్యూటీ ఎప్పుడూ ముందే ఉంటుంది, కానీ మ్యాచ్ ఉన్న రోజున ఇది మరీ ఎక్కువైంది. అన్షుల్ కాంబోజ్.. త్వరగా క్యాబ్ పట్టుకుని చెపాక్ స్టేడియానికి వచ్చేయ్, ఈరోజు పెద్ద మ్యాచ్ ఉంది!" అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. అశ్విన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది, క్రికెట్ అభిమానులు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

స్పందించిన సీఎస్కే యాజమాన్యం
ఈ గందరగోళానికి సీఎస్కే యాజమాన్యం సరదాగానే ముగింపు పలికింది. అన్షుల్ కాంబోజ్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. "ఎవరూ ఆందోళన చెందకండి, అన్షుల్ ఇక్కడే ఉన్నాడు.. మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు" అని క్లారిటీ ఇచ్చింది. ఫోటోలో ఉన్న భద్రతా అధికారి అచ్చం అన్షుల్‌లా ఉండటంతో ఒక క్షణం అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఏదేమైనా మ్యాచ్‌కు ముందు జరిగిన ఈ సరదా సంఘటన ఐపీఎల్ ఫ్యాన్స్‌కు మంచి వినోదాన్ని అందించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

